Begin typing your search above and press return to search.

డివైడ్‌ టాక్‌ తోనూ నూరు కోట్లు కొల్లగొట్టింది

By:  Tupaki Desk   |   7 March 2022 4:30 AM GMT
డివైడ్‌ టాక్‌ తోనూ నూరు కోట్లు కొల్లగొట్టింది
X
బాలీవుడ్‌ హాట్‌ లేడీ.. స్టార్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ ప్రథాన పాత్రలో నటించిన గంగూభాయ్‌ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫిబ్రవరి 25న దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ఈ సినిమా ను విడుదల చేశారు. ఆలియా భట్ కు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉండటంతో పలు భాషల్లో ఈ సినిమాను డబ్‌ చేశారు. ఇక బాలీవుడ్‌ స్టార్‌ ఫిల్మ్‌ మేకర్‌ సంజయ్‌ లీలా భన్సాలీ ఈ సినిమాను తెరకెక్కించిన కారణంగా అంచనాలు మరింతగా పెరిగాయి.

లేడీ ఓరియంటెడ్‌ మూవీగా.. ఒక లెజెండ్ లేడీ బయోపిక్ గా రూపొందిన గంగూభాయ్ సినిమా మిశ్రమ స్పందన దక్కించుకుంది. ఆలియా భట్ ఆకట్టుకుంది అంటూనే ఓవరాల్‌ గా సినిమా పెద్దగా నచ్చలేదు అంటూ కొందరు కామెంట్ చేశారు. సంజయ్ లీలా భన్సాలీ స్థాయి లో ఈ సినిమా లేదు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. సినిమా కు మిశ్రమ స్పందన వచ్చినా కూడా వసూళ్లు మాత్రం కుమ్మేస్తోంది.

కరోనా థర్డ్‌ వేవ్‌ తర్వాత వచ్చిన మొదటి భారీ సినిమా గా గంగూభాయ్ నిలిచింది. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా నూరు కోట్ల మార్క్ కు చేరువ అయ్యింది. ఈ వీకెండ్‌ లేదా ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లోనే గంగూభాయ్ సినిమా కు వంద కోట్ల వసూళ్లు నమోదు అవ్వడం ఖాయం అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చాలా నమ్మకంతో ఉన్నారు. అనుకున్నట్లుగానే వంద కోట్ల వసూళ్ల కు అతి సమీపంలో గంగూభాయ్ నిలిచింది.

గంగూభాయ్ జీవిత చరిత్ర ను సినిమా తీయడం ను కొందరు వ్యతిరేకించినా కూడా సినిమాను సంజయల్‌ లీలా భన్సాలీ సినిమా ను తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. సినిమా విడుదలకు ముందు దేశ వ్యాప్తంగా ఉన్న ఆలియా అభిమానుల దృష్టిని ఆకర్షించింది. అంతే కాకుండా ప్రతి ఒక్కరికి కనెక్ట్‌ అయ్యే విధంగా అన్ని రకాల సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయంటూ కామెంట్స్ వస్తున్నాయి.

యూత్‌ లో యమ క్రేజ్ ఉన్న ఆలియా భట్‌ తన స్థాయిని మరో సారి నిరూపించుకుంది. లేడీ ఓరియంటెడ్‌ మూవీ వంద కోట్ల వసూళ్లు అంటే ఖచ్చితంగా రికార్డు అనడంలో సందేహం లేదు. ఆలియా క్రేజ్ కు ఈ వంద కోట్లు నిదర్శణం అంటూ ఆమె అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆ మద్య బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్ కంగనా రనౌత్‌ ఈ సినిమాకు వస్తున్న వసూళ్ల విషయంలో విమర్శలు చేసింది. వంద కోట్లు సాధించిన నేపథ్యంలో ఇప్పుడేం అంటుందో చూడాలి.