Begin typing your search above and press return to search.
అమెరికా ట్రెండ్స్ లిస్ట్ లో టాప్-10 లో గంగూబాయి!
By: Tupaki Desk | 27 April 2022 7:30 AM GMTబాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'గంగూబాయి కతియావాడి' థియేటర్ రిలీజ్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల మోత మోగించింది. దాదాపు 200 కోట్ల వసూళ్లతో గంగూబాయి రికార్డు సృష్టించింది. గంగూబాయి గా అలియాభట్ నట విశ్వరూపం చూపించింది. ఈ ఒక్క సక్సెస్ అలియాభట్ ని అగ్ర స్థానాన నిలబెట్టింది.
నటిగా అలియా సత్తా చాటిన చిత్రంగా నిలిచింది. అమ్మడి ఇమేజ్ రెట్టింపు అయింది. లేడీ ఓరియేంటెడ్ చిత్రాల హీరోయిన్ల సరసన అలియాభట్ ని నిలబెట్టింది. మోస్ట్ హ్యాపనింగ్ స్టార్ గా నిలిచింది. ఇటీవలే సినిమా నెట్ ప్లిక్స్ లో కూడా రిలీజ్ అయింది. సినిమా అక్కడ కూడా దుమారం రేపుతోంది.
గంగూబాయి బుల్లి తెర ఆడియన్స్ ని వదిలిపెట్టలేదు. ఈ సినిమా రిలీజ్ తో నెట్ ప్లిక్స్ కి కొత్త సబ్ స్ర్కైబర్లు పెరిగినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా అమెరికాలో అరుదైన రికార్డును సాధించినట్లు తెలుస్తోంది.
యూఎస్ ట్రెండ్స్ లిస్ట్ లో గంగూబాయి కతియావాడి ఏకంగా టాప్ -10లోనే నిలిచింది. యూఎస్ లో టాప -10 లో కేవలం హాలీవుడ్ చిత్రాలకే స్థానం ఉంటుంది. కానీ గంగూబాయి హాలీవుడ్ సినిమాల్ని సైతం తలదన్నిందని తాజా రిప్టోర్ ని బట్టి తెలుస్తోంది. అంటే సినిమా గ్లోబల్ సినిమాగా ఫేమస్ అయినట్లే.
తెలుగు ప్రజలతో పాటు..విదేశీయులు కూడా సినిమా చూస్తే అది గ్లోబల్ మూవీగా ఫేమస్ అవుతుంది. 'గంగూబాయి కతియవావాడి' ముంబైలో జరిగిన వాస్తవ సంఘటనలు అధారంగా తెరకెక్కింది. ముంబైలోని కమాఠీపుర ప్రాంతానికి చెందిన ఓ మహిళా మాఫియా డాన్ కథ. ఆమె జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలున్నాయి. కథలో ఎంతో ఎమోషన్ ఉంది.
ఆ కారణాంగానే సినిమాకి అమెరికా అభిమానులు నెట్ ప్లిక్స్ లో బ్రహ్మరధం పడుతున్నట్లు కనిపిస్తుంది. ఈచిత్రానికి సంజయ్ లీలాభన్సాలీ దర్శకత్వం వహించారు. భన్సాలీ ప్రొడక్షన్స్ - పెన్ ఇండియా లిమిటెడ్ సంయుక్తంగా నిర్మించాయి.