Begin typing your search above and press return to search.

సైరాకు వ‌చ్చిన క‌ష్టమే గంగూభాయికి..!

By:  Tupaki Desk   |   18 Feb 2022 2:30 AM GMT
సైరాకు వ‌చ్చిన క‌ష్టమే గంగూభాయికి..!
X
ట్యాలెంటెడ్ ఆలియా భట్ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆర్.ఆర్.ఆర్ తో పాటు గంగూబాయి కతియావాడి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఆర్.ఆర్.ఆర్ వాయిదా అనంత‌రం.. ప్ర‌స్తుతం గంగూభాయి రిలీజ్ ప్ర‌మోషన్స్ లో ఆలియా బిజీగా ఉంది.

తాజాగా ఈ మూవీపై ఊహించ‌ని వివాదం ముసురుకుంది. దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ గంగూభాయి పాత్రను కించపరిచే విధంగా ప్రదర్శించారని అది స‌రికాద‌ని గంగూబాయి కుటుంబం ఆరోపించింది.

గంగూబాయి దత్తపుత్రుడు బాబు రావుజీ షా .. ఆమె మనవరాలు భారతి తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. థియేట్రికల్ ట్రైలర్ లో గంగూబాయి పాత్రను ప్రదర్శించిన విధానం స‌రిగా లేద‌ని అసంతృప్తిగా ఉన్నారు భార‌తి. నిజానికి భార‌తి ఏడాది కాలంగా ఈ సినిమాకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు.

గత ఏడాది కూడా ముంబై కోర్టులో పిటిషన్ వేశారు. ఇదే విషయమై భ‌న్సాలీ- అలియా భట్ లకు కోర్టు సమన్లు జారీ చేసింది. ఆ తర్వాత బాంబే హైకోర్టు సినిమా విడుదలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. మేకర్స్ పై క్రిమినల్ పరువు నష్టం కేసులపై మధ్యంతర స్టేను మంజూరు చేసింది.

ఈ వివాదం ఇప్పుడు మ‌రో మ‌లుపు తీసుకుంది. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడిన బాబు రావూజీ.. సినిమాలో తన తల్లిని వేశ్యగా చూపించార‌ని అది దారి మ‌ళ్లించిన త‌ప్పుడు క‌థ అని ఆరోపించారు. ప్రజలు ఇప్పుడు ఆమె గురించి వివరించలేని విషయాలు ముచ్చ‌టిస్తున్నార‌ని ఆవేద‌న చెందారు.

గంగూబాయి కుటుంబం తరపు న్యాయవాది నరేంద్ర మాట్లాడుతూ... సినిమా ప్రకటించినప్పటి నుండి స‌ద‌రు కుటుంబం (2020 నుండి) తమ ఇళ్లను మారుస్తోందని చెప్పారు. గంగూబాయి నిజ జీవితంలో వ్యభిచారిణిగా చూపినందున‌ ఆమె కుటుంబాన్ని బంధువులు.. ఇతర వ్యక్తులు నిత్యం ప్రశ్న‌ల‌తో వేధిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమా వల్ల కుటుంబ మానసిక స్థితి దెబ్బతింటోందని అన్నారు.

డబ్బు సంపాద‌నే ధ్యేయంగా క‌థలు మార్చారు. పేరాశ‌తో మేకర్స్ తన కుటుంబం పరువు తీశారని గంగూబాయి మనవరాలు భారతి ఆరోపించింది. ఈ ప్రాజెక్ట్ ను ప్రకటించే ముందు నిర్మాతలు కుటుంబ సభ్యుల అంగీకారం తీసుకోలేదని ఆమె పేర్కొంది. తన అమ్మమ్మ పేదల అభ్యున్నతి కోసం పనిచేశారని అయితే మేకర్స్ తనను వ్యభిచారిగా మార్చారని ఆమె అన్నారు.

ఈ ఆరోపణలపై గంగూబాయి కతియావాడి నిర్మాతలు ఇంకా స్పందించలేదు. ఇదిలా ఉంటే ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. గంగూభాయి ట్రైల‌ర్ కి ప్ర‌పంచ‌వ్యాప్తంగా అద్భుత స్పంద‌న ల‌భించింది. ఆలియాకు ఈ సినిమాతో జాతీయ అవార్డు ఖాయ‌మ‌న్న చ‌ర్చా సాగుతోంది.

ఇంత‌కుముందు సైరా - న‌ర‌సింహారెడ్డి లాంటి భారీ పాన్ ఇండియా చిత్రానికి ఇలాంటి చిక్కులు వ‌చ్చి ప‌డ్డాయి. ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి క‌థ‌ను మార్చేశార‌ని కుటుంబీకులు ఆరోపించ‌డం తెలిసిన‌దే.