Begin typing your search above and press return to search.
'గంగూబాయి' ట్రైలర్: క్వీన్ గా అదరగొట్టిన అలియా..!
By: Tupaki Desk | 4 Feb 2022 9:54 AM GMTసంజయ్ లీలా భనాల్సీ దర్శకత్వంలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ''గంగూబాయి కతియావాడి''. ముంబై మాఫియా క్వీన్ గంగూబాయి జీవితకథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. కరోనా నేపథ్యంలో వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమా ఎట్టకేలకు 2022 ఫిబ్రవరి 25న విడుదల కాబోతోంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ట్రైలర్ ను మేకర్స్ ఆవిష్కరించారు.
''కామటీపురంలో అమావాస్య రాత్రి కూడా అంధకారం ఉండదు అంటారు.. ఎందుకంటే అక్కడ గంగూ ఉంటుంది'' అని చెప్తున్నప్పుడు అలియా ఓ కారు నుంచి దిగడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఇది కమాఠిపుర నాయకురాలు గంగూబాయిగా అలియా భట్ స్వాగ్ ను పరిచయం చేస్తోంది. వేశ్యగా జీవితాన్ని ప్రారంభించిన గంగుబాయి.. కాలక్రమేణా ఒక నాయకురాలిగా అవతరించింది. బొంబాయిలోని రెడ్ లైట్ ఏరియాలో నివసిస్తున్న సెక్స్ వర్కర్ల హక్కుల కోసం పోరాడుతుంది.
విభిన్నమైన కోణాల్లో ఉన్న శక్తివంతమైన పాత్రను ఆలియా చాలా ఈజీగా పోషించిందనే చెప్పాలి.ఇప్పటి వరకు అలియా పెరఫార్మన్స్ లో ఇదే బెస్ట్ అని చెప్పొచ్చు. చిన్న వయస్సులోనే ఇలాంటి బరువైన పెద్ద పాత్రను పోషించి అందరి మన్ననలు అందుకుంటోంది. అమ్మడు ఈ సినిమాతో మరో స్థాయికి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. విజయ్ రాజ్ ఇందులో ఒక నపుంసకుడి పాత్రను పోషించాడు. అలానే స్టార్ హీరో అజయ్ దేవగన్ కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు.
ముంబై యాసలో చెప్పిన 'మీ ఇజ్జత్ ఒకసారి పోతే పోయినట్టే.. కానీ రోజు రాత్రి మేము ఇజ్జత్ అమ్ముతాం' వంటి డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి. ప్రొడక్షన్ డిజైన్ మరియు సినిమాటోగ్రఫీ అదనపు ఆకర్షణగా నిలిచాయి. మొత్తం మీద ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకోవడమే కాదు.. సినిమాపై అంచనాలను రెట్టింపు చేసిందని చెప్పాలి. అలానే సంజయ్ లీలా భనాల్సీ నుంచి మరో అద్భుతమైన సినిమా రానుందని సూచిస్తోంది.
హుస్సేన్ జైదీ రచించిన ‘మాఫీయా క్వీన్స్ ఆఫ్ ముంబై’ లోని ‘మేడమ్ ఆఫ్ కామతిపుర’ ఆధారంగా ''గంగూబాయి కతియావాడి'' సినిమాని తెరకెక్కించారు. పెన్ స్టూడియోస్ - బన్సాలీ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై జయంతిలాల్ గడా - సంజయ్ లీలా బన్సాలీ సంయుక్తంగా నిర్మించారు. పాన్ ఇండియా స్థాయిలో హిందీ, తెలుగుతో పాటుగా మరికొన్ని ప్రధాన భారతీయ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.