Begin typing your search above and press return to search.
గని - లైగర్.. జోనర్ ఒకటే! మరి కథలు..?
By: Tupaki Desk | 22 Jan 2021 1:30 AM GMTఒక జోనర్ లో చాలా సినిమాలు వస్తాయి. అయితే.. ఒకేసారి రావడం కూడా అరుదుగా చూస్తుంటాం. అనుకోకుండా సినిమాలు క్లాష్ అవుతుంటాయి. ఇప్పుడు వరుణ్ తేజ్ - విజయ్ దేవరకొండ విషయంలో అదే జరిగింది. వారి అప్ కమింగ్ సినిమాలు ఒకే కథాంశంతో రాబోతున్నాయి. అదే బాక్సింగ్. ఈ సింగిల్ లైన్ తో రెండు సినిమాలూ ఒకే సారి రాబోతుండడంతో ఆసక్తి రేకెత్తుతోంది.
మెగా హీరో వరుణ్ తేజ్ లాక్ డౌన్ కన్నా ముందుగానే.. బాక్సింగ్ నేపథ్యంలో ఒక సినిమాను సెట్స్ పైకి తెచ్చిన విషయం తెలిసిందే. కిరణ్ కొర్రపాటి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు బాక్సర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారనే రూమర్స్ కూడా వచ్చాయి. అయితే.. లేటెస్ట్ గా వరుణ్ బర్త్ డే సందర్భంగా 'గని' అనే టైటిల్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
ఇక, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ - విజయ్ దేవరకొండ కాంబోలో వస్తున్న మూవీ కూడా లాక్ డౌన్ కంటే ముందుగానే మొదలైంది. ఫైటర్ అనే టైటిల్ ను ఈ చిత్రానికి పెట్టారని ప్రచారం జరిగినప్పటికీ.. ఫైనల్ గా ‘లైగర్’ అని ఫిక్స్ చేశారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రూ.120కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే.. ఈ రెండు కథలూ బాక్సింగ్ చుట్టూ తిరిగేవే అయినప్పటికీ.. వీటి మధ్య చాలా తేడా ఉందని తెలుస్తోంది. వరుణ్ 'గని'లో క్రీడాకారులపై చూపుతున్న నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపనుంది. ఒలింపిక్ పతకాలు సాధించిన వారిలో అందరు క్రీడాకారులు తగిన గుర్తింపును పొందలేకపోతున్నారు. ఇక, మన దేశంలో పరిస్థితి ఎలా ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఈ నిర్లక్ష్యాన్ని తన చిత్రం హైలైట్ చేస్తుందని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు కిరణ్ వెల్లడించారు.
ఇక.. క్రాస్ బ్రీడ్ 'లైగర్' పేరు పెట్టి తనదైన టైటిల్ మార్కును మరోసారి చాటిచెప్పాడు పూరీ. అయితే.. ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలోనే తెరకెక్కుతున్నప్పటికీ.. ఇది ఒక రివేంజ్ డ్రామా అని సమాచారం. ఇందులో పూరి మార్క్ డైలాగులతోపాటు హెవీ వెయిట్ యాక్షన్ సీక్వెన్స్ పుష్కలంగా ఉంటాయట. సో.. ఈ విధంగా.. ఈ రెండు సినిమాలూ ఒకే జోనరల్ తెరకెక్కుతున్నప్పటికీ.. ఇన్నర్ గా డిఫరెంట్ స్టోరీ లైన్ తో ముందుకు రాబోతున్నాయని తెలుస్తోంది. మరి, ఎందులో ఏముందో తెలియాలంటే.. రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.