Begin typing your search above and press return to search.
హీరొయిన్ తో అఫైర్ గురించి మంత్రి క్లారిటీ
By: Tupaki Desk | 11 March 2018 2:04 PM GMTనిన్న ఉన్నట్టుండి కొన్ని వెబ్ సైట్స్ లో మంత్రి గంటా శ్రీనివాసరావు కొడుకు గంటా రవికి హీరొయిన్ సాయి పల్లవికి మంచి సాన్నిహిత్యం ఉన్నట్టు వార్తలు రావడం బాగా వైరల్ అయ్యింది . ఇలాంటి నిరాధార వార్తలు రావడం ఈ మధ్య ఎక్కువైనప్పటికీ కొన్ని పేరున్న వాటిలోనే ఇది రావడం చర్చకు దారి తీసింది. ఆ నోటా ఈ నోటా ఇది మొత్తానికి గంటా వారింటికి చేరింది. నేరుగా గంటా శ్రీనివాసరావు స్వయంగా స్పందిస్తూ తన కొడుకు రవి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నాడని, మీ వీడియోలకు లైకుల కోసం అతని భవిష్యత్తుని ఎంతో టాలెంట్ ఉన్న ఒక అమ్మాయి కెరీర్ ని పణంగా పెట్టకండి అని కోరారు. ఇది అంతకంతకు హద్దులు లేకుండా వ్యాప్తి చెందటంతో కలత చెందిన గంట స్వయంగా చెప్పాల్సి వచ్చిందట.
ఇలాంటివి కొత్తమి కాదు. మొన్నే శ్రీకాంత్ కు యాక్సిడెంట్ అయినట్టు నకిలీ వార్తలు సృష్టించి స్వయంగా తనే మీడియా ముందుకు వచ్చి ఏం కాలేదు అని చెప్పేదాకా వచ్చింది వ్యవహారం. ఇది ఎలా కట్టడి చేయాలో అర్థం కాక పరిశ్రమ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. వీటి వల్ల నిజాయితీగా నిష్పాక్షపాతంగా వార్తలు అందించే మీడియా సంస్థలకు కూడా చెడ్డ పేరు వస్తోంది. ఆ మధ్య ఎంఎస్ నారాయణ గారు పోక ముందు కూడా ఇంతే ఓవర్ యాక్షన్ చేస్తే ఆయన కొడుకు కూతురు బయటికి వచ్చి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఈ పైత్యం ఇక్కడ మాత్రమే లేదు. గత ఏడాది ప్రముఖ హాస్య నటుడు సెంథిల్ ను చంపినంత పని చేస్తే ఆయన నేను బ్రతికే ఉన్నాను బాబోయ్ అని చెప్పుకోవాల్సి వచ్చింది. సైబర్ క్రైమ్ లో ఇప్పుడు ఇలాంటి కేసులు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. దీనికి చట్టప్రకారంగా పరిష్కారం కన్నా నైతిక పరంగా ఎవరికి వారు ఆలోచించుకుంటే బెటర్.