Begin typing your search above and press return to search.

చిరు ఫొటో సెషన్.. స్టేజిపైనే గరికపాటి అసహనం

By:  Tupaki Desk   |   6 Oct 2022 10:49 AM GMT
చిరు ఫొటో సెషన్.. స్టేజిపైనే గరికపాటి అసహనం
X
మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్ లో ఇటీవల చాలా బిజీగా పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే ఆయన ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా నాంపల్లి లో జరిగిన విజయదశమి నవరాత్రి ఉత్సవాల్లో కూడా ఆయన ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఇక మెగాస్టార్ వస్తున్నారు అనగానే అక్కడకి చాలామంది జనాలు వచ్చారు. ఈ క్రమంలో మెగాస్టార్ తో ఫోటోలు దిగేందుకు కూడా ఎంతోమంది ప్రముఖుల పిల్లలు కూడా ఎగబడ్డారు.

ముఖ్యంగా మహిళలు మెగాస్టార్ చిరంజీవిని కలుసుకునేందుకు తీవ్రంగా పోటీ పడడంతో కొంతసేపటి వరకు అక్కడ సెక్యూరిటీ కి ఇబ్బంది కలిగింది. ఇక మెగాస్టార్ కూడా వచ్చిన మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా ఫోటోలు ఇచ్చేందుకు ప్రయత్నం చేశారు. అయితే అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు మాట్లాడిన విధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మెగాస్టార్ చిరంజీవితో అందరూ కూడా ఫోటోలు దిగుతూ ఉండగా ఆయన అప్పుడు తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఈ క్రమంలో కొంత ఆయనకు ఇబ్బందిగా అనిపించడంతో వెంటనే రియాక్ట్ అయ్యారు.

మెగాస్టార్ చిరంజీవి గారు వెంటనే ఫోటో సెషన్ ఆపేసి ఇక్కడ పక్కన వచ్చి కూర్చోవాలని అని పదేపదే చెప్పడం జరిగింది. అయితే మెగాస్టార్ మాత్రం వచ్చిన మహిళలందరి అప్పుడే ప్రయత్నం చేశారు. కానీ అందరూ కూడా ఒకేసారి సిద్ధం కావడంతో ఆయన ఫోటోలకు స్టిల్ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఇక ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక రెండవసారి కూడా గరికపాటి నరసింహారావు గారు మెగాస్టార్ చిరంజీవి గారు వెంటనే ఫోటోలను ఆపేసి నా పక్కన వచ్చి కూర్చోవాలి అని అన్నారు. అంతేకాకుండా ఫొటోస్ సెషన్ ఆపకపోతే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని దాంట్లో ఎలాంటి మొహమటం లేదు అని అన్నారు.

ఇక అక్కడ నిర్వాహకులు కొంత గరికపాటి గారికి విషయం అర్ధమయ్యేలా చెప్పారు. అయినప్పటికీ కూడా విషయం ఏదైనా సరే ఇలా జరగకూడదు అని అన్నారు. ఇక తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు కూడా వెంటనే అక్కడి నుంచి వచ్చి చిరునవ్వుతో గరికపాటి గారిని పలకరించారు. ఆ తర్వాత ఆ ఈవెంట్ ప్రశాంతంగా ముగిసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.