Begin typing your search above and press return to search.
శ్రీవిష్ణు సినిమాలో `గరుడ రామ్` విలనీ
By: Tupaki Desk | 7 July 2021 6:30 AM GMT`కేజీఎఫ్` చిత్రంలో మాస్ ఆహార్యంతో మెప్పించిన విలన్ రామ్ అలియాస్ గరుడ రామ్ ప్రస్తుతం టాలీవుడ్ లోనూ పాపులరవుతున్నారు. ఇటీవలే అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న `మహా సముద్రం`లో అతడు విలన్ పాత్రకు ఎంపికయ్యాడు. గరుడ రామ్ భీకరాకారుడు..అతడి విలనీకి ప్రత్యేకత ఉంటుందని తెలుగు దర్శకనిర్మాతలు భావించి వరుసగా అవకాశాలిస్తున్నారు.
తాజా సమాచారం మేరకు శ్రీవిష్ణు- చైతన్య దంతులూరి కాంబినేషన్ లో.. వారాహి చలన చిత్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రంలో అతడి లుక్ రివీలైంది.
దర్శకుడు చైతన్య దంతులూరి శ్రీ విష్ణును ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ప్రదర్శించడానికి అసాధారణమైన స్క్రిప్ట్ ను సిద్ధం చేశారు. పాపులర్ ప్రొడక్షన్ హౌస్ వారాహి చలన చిత్రమ్ అధినేత సాయి కొర్రపాటి సమర్పణలో ఈ చిత్రాన్ని రజనీ కొర్రపాటి నిర్మిస్తున్నారు.
కేథరీన్ థ్రెసా ఈ చిత్రంలో కథానాయిక. ఈ చిత్రంలో కేథరిన్ శక్తివంతమైన పాత్రను పోషిస్తుంది. కెజీఎఫ్ లో తన ప్రతినాయకత్వంతో భయపెట్టిన రామ్ ప్రధాన విలన్ గా నటిస్తున్నారు. గరుడ రామ్ గెటప్ ని ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆనంద్ బలి పేరుతో విడుదల చేశారు. అతని లుక్.. క్యారెక్టరైజేషన్.. బాడీ లాంగ్వేజ్ .. టైమింగ్ అన్నీ అతను ఇంతకు ముందు చేసిన లేదా ఇప్పుడు చేస్తున్నదానికంటే భిన్నంగా అలరించింది. ఫస్ట్ లుక్ పోస్టర్లో అతను పొడవాటి జుట్టు గుబురు గడ్డంతో రఫ్ గా కనిపించారు.
మెలోడీ బ్రహ్మ మణి శర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆల్బమ్‌లో ఐదు పాటలు వేటికవే ప్రత్యేకం. సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా.. మార్తాండ్ కె వెంకటేష్ .. గాంధీ నాడికుడికర్ తదితర సాంకేతిక బృందం పని చేస్తున్నారు.