Begin typing your search above and press return to search.

‘గరుడ వేగ’ టీంలో టెన్షన్ టెన్షన్

By:  Tupaki Desk   |   9 Nov 2017 4:46 PM GMT
‘గరుడ వేగ’ టీంలో టెన్షన్ టెన్షన్
X
గత వారం విడుదలైన ‘గరుడవేగ’కు చాలా మంచి టాక్ వచ్చింది. రివ్యూలు కూడా పాజిటివే. సోషల్ మీడియాలో ఎటు చూసినా ఈ సినిమా గురించి పాజిటివ్ టాకే కనిపించింది. కానీ అంతా సానుకూలంగా ఉన్నప్పటికీ ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. తొలి వారాంతంలో కేవలం రూ.3.2 కోట్ల షేర్ మాత్రమే వసూలైంది. వీకెండ్ తర్వాత వసూళ్లు ఇంకా తగ్గాయి. ఇప్పటికి ఆ సినిమా రూ.5 కోట్లకు అటు ఇటుగా షేర్ రాబట్టిందంతే.

ఈ చిత్ర బడ్జెట్ రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్లని అంటున్నారు. ఐతే దానికి తగ్గట్లుగా రేట్లు చెబితే బయ్యర్లు కొనడానికి ముందుకు రాలేదు. దీంతో తక్కువ మొత్తాలకే అమ్మారు. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావాలన్నా రూ.12 కోట్ల దాకా ఈ సినిమా వసూలు చేయాల్సి ఉంది. కానీ ఇప్పుడు అది ఆ మొత్తం వసూలు చేయడం కూడా పెద్ద టాస్కే అయిపోయింది. ఇప్పుడు ‘గరుడవేగ’ ఆశలన్నీ రెండో వీకెండ్ మీదే ఉన్నాయి.

ఐతే ఈ వారం ఒకటికి నాలుగు సినిమాలు షెడ్యూలయ్యాయి. ఆల్రెడీ గురువారం ‘అదిరింది’ రిలీజైంది. ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. కానీ ఈ సినిమా చుట్టూ ముసురుకున్న వివాదాల వల్ల ఓపెనింగ్స్ అయితే బాగానే వచ్చాయి. ఇక శుక్రవారం రిలీజయ్యే ‘ఒక్కడు మిగిలాడు’.. ‘కేరాఫ్ సూర్య’.. ‘డిటెక్టివ్’ సినిమాల టాక్ ఎలా ఉంటుందో చూడాలి.

‘డిటెక్టివ్’ సంగతలా ఉంచేసినా.. మిగతా రెండు సినిమాల టాక్.. వాటికి ఓపెనింగ్స్ ఎలా వస్తాయా అని ‘గరుడవేగ’ టీం ఉత్కంఠగా చూస్తోంది. వాటికి టాక్.. వసూళ్లు బాగుండి ప్రేక్షకుల్ని ఆకర్షిస్తే ‘గరుడవేగ’ పనైపోతుంది. వీకెండ్ నామమాత్రపు వసూళ్లే వస్తాయి. అలా కాకుండా అవి వీక్ అయితే.. సెకండ్ వీకెండ్లో చెప్పుకోదగ్గ షేర్ రాబట్టి నష్టాల్ని కొంతమేర కవర్ చేసుకోవచ్చు. మరి ఈ వారం సినిమాల సంగతేంటో చూడాలి.