Begin typing your search above and press return to search.
గరుడవేగ డబ్బింగ్ హక్కులపై గొడవ?
By: Tupaki Desk | 14 Nov 2017 6:38 PM GMTరాజశేఖర్ రీఎంట్రీ మూవీ ‘గరుడవేగ’ ఇటీవలే విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఐతే టాక్‌కు తగ్గట్లు వసూళ్లు లేకపోయినప్పటికీ.. ఈ చిత్రానికి శాటిలైట్, డబ్బింగ్, రీమేక్ హక్కుల విషయంలో మంచి ఆఫర్లే వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఓ టీవీ ఛానెల్ రూ.4.5 కోట్ల దాకా వెచ్చించి ‘గరుడవేగ శాటిలైట్ హక్కుల్ని కొనుగోలు చేసినట్లు కూడా చెబుతున్నారు. మరోవైపు ‘గరుడవేగ’ హిందీ హక్కుల విషయంలోనూ మంచి ఆఫర్లే ఉన్నాయట. కాకపోతే ఈ హక్కుల విషయంలో అంతర్గతంగా పెద్ద గొడవలే నడుస్తున్నట్లు సమాచారం. హక్కుల విషయంలో ఎవరికి వారుగా డీల్స్ చేసుకుంటున్నారట.
‘గరుడవేగ’ సినిమాను కోటేశ్వరరాజు అనే కొత్త నిర్మాత ప్రొడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన రాజశేఖర్ కుటుంబానికి సన్నిహితుడని చెప్పుకున్నారు. ఐతే ఈ సినిమా విడుదలకు ముందు ఆయన పెద్దగా కనిపించింది లేదు. రాజశేఖర్ కుటుంబంతో విభేదాల వల్లే ఆయన దూరంగా ఉన్నాడని.. దీంతో జీవిత అన్నీ తానై సినిమాను రిలీజ్ చేయించిందని ఇండస్ట్రీలో చెప్పుకున్నారు. ఐతే ఇప్పుడు ‘గరుడవేగ’ హిందీ హక్కుల విషయంలో కోటేశ్వరరాజు సైలెంటుగా ఒక హిందీ డిస్ట్రిబ్యూటర్‌తో డీట్ చేసుకున్నారట. మరోవైపు జీవిత కూడా మరో వ్యక్తికి హక్కులు అమ్మిందట. ఇదిలా ఉంటే రిలీజ్ ముంగిట ఈ చిత్రానికి ఫైనాన్స్ సమకూర్చిన ఒక వ్యక్తికి నాన్-థియేట్రికల్ రైట్స్ కట్టబెడుతూ ఒప్పందం జరిగిందట. అతను సైతం హక్కులు అమ్మేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లుగా చెబుతున్నారు. ఈ విషయంలో మూడు వర్గాల మధ్య గొడవ తలెత్తగా.. దాని పంచాయితీకి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.