Begin typing your search above and press return to search.

ఇప్పుడు మోజు పడ్డావ్‌ ఏంటి గౌరీ?

By:  Tupaki Desk   |   7 April 2015 5:30 PM GMT
ఇప్పుడు మోజు పడ్డావ్‌ ఏంటి గౌరీ?
X
ఫ్రెష్‌నెస్‌ కోసం, ఎనర్జీ కోసం కార్పొరెట్‌ సంస్థలు కొత్త కొత్త మోడల్స్‌ వెంట పడుతుంటారు. అయితే ఫ్రెష్‌ లుక్‌ కోసం ఎవరైనా యంగ్‌ మోడల్‌ వెనుక పడితే ఆ సీన్‌ వేరేలా ఉంటుంది కాని, ఓ సీనియర్‌ లేడీ, ఓ 40 ప్లస్‌ ఆంటీ వెనుక పడితే ఎలాగుంటుంది?

లవర్‌బోయ్‌ రణబీర్‌ కపూర్‌ తల్లి నీతూసింగ్‌, సోదరి రిదిమ కపూర్‌ ఇద్దరూ గత ఏడేళ్లుగా ఓ ప్రముఖ జువెలరీ సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్స్‌గా కొనసాగుతున్నారు. అయితే ఇటీవలే సదరు సంస్థ ఆ ఇద్దరినీ తొలగించి బాద్‌షా షారూక్‌ ఖాన్‌ భార్య గౌరీఖాన్‌ని ప్రచారానికి నియమించుకుంది. ఇంతకాలం గౌరీఖాన్‌ ఇంటీరియర్‌ డిజైనర్‌గా కొనసాగేది. ముంబై బాంద్రాలోని సెలబ్రిటీల ఇళ్లకు ఇంటీరియర్‌ డిజైన్‌ చేసేది. కానీ అనూహ్యంగా ఈమధ్య సూపర్‌ మోడల్‌ అయిపోయింది. ర్యాంప్‌ వాక్‌లు, షోలతో పిచ్చెక్కించింది. ఏంటో ఈ వయస్సు మళ్ళిన మాయ మరి.

ఈ మధ్యనే షారూఖ్‌ భార్య గౌరీ ఎందుకో మరోసారి తన మోడలింగ్‌ రంగంలో సత్తా చాటాలని అనుకుంటోందో ఏంటో తెలియదుకాని, ఇలాంటి ప్రకటనలను తెగ సైన్‌ చేస్తోంది. పైగా భర్తతో కలసి కూడా కొన్ని ఫోటో షూట్లు చేస్తోంది. లేటు వయస్సులో ఈవిడకు మోడలింగ్‌పై ఈ మోజు ఎందుకో...