Begin typing your search above and press return to search.

స్టార్ హీరో సీక్రెట్ ను బయట పెట్టిన భార్య

By:  Tupaki Desk   |   2 April 2019 6:20 AM GMT
స్టార్ హీరో సీక్రెట్ ను బయట పెట్టిన భార్య
X
బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌ తాజాగా తన భార్య గౌరీ ఖాన్‌ తో కలిసి ఒక అవార్డు వేడుకలో పాల్గొన్నాడు. ఈ సందర్బంగా వారికి బెస్ట్‌ స్టైలిష్‌ కపుల్‌ అవార్డు దక్కింది. అవార్డు అందుకున్న సమయంలో గౌరీ ఖాన్‌ మాట్లాడుతూ.. ఏదైనా కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడే సమయంలో మాత్రం 20 నిమిషాల్లో రెడీ అయ్యి వెళ్లి పోతాడు. కాని అదే ఏదైనా పార్టీకి వెళ్లాలి అంటే మాత్రం చాలా స్టైలిష్‌ గా రెడీ అవ్వాలనుకుంటాడు. గంటల కొద్ది టైం కేటాయించి ముస్తాబు అవుతాడు.

మాట్లాడేందుకు స్టైల్‌ అవసరం లేదు, కాని పార్టీకి వెళ్లినప్పుడు మాత్రం తప్పనిసరిగా స్టైల్‌ మెయింటెన్‌ చేయాలని అంటూ ఉంటాడు. ఇక్కడకు వచ్చే సమయంలో కూడా నేను మూడు గంటల పాటు రెడీ అయితే, ఆయన మాత్రం ఆరు గంటల సమయంను రెడీ అయ్యేందుకు తీసుకున్నాడు అంటూ చమత్కరించింది. దాంతో అంతా కూడా గట్టిగా నవ్వేశారు. పక్కనే ఉన్న షారుఖ్‌ ఖాన్‌ కూడా భార్య గౌరీ ఖాన్‌ మాటలకు నవ్వాడు.

29 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న వీరిద్దరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొడుకు హీరోగా పరిచయం అయ్యేందుకు సిద్దం అవుతున్నాడు. అయినా ఇద్దరు కూడా కొత్త జంట తరహాలో చాలా అన్యోన్యంగా ఉంటారు. బాలీవుడ్‌ లో ఎంతో మంది సెలబ్రెటీల వైవాహిక జీవితాల్లో ఇబ్బందులు తలెత్తాయి. కాని వీరి వైవాహిక జీవితం గురించి ఎప్పుడు కూడా మీడియాలో వార్తలు రాలేదు. ఇద్దరి మద్య అండర్‌ స్టాండింగ్‌ మరియు ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవడం చేస్తారు. అందుకే వీరిద్దరు బెస్ట్‌ కపుల్‌ అయ్యారు.