Begin typing your search above and press return to search.
ఇన్నేసి పోస్టర్లు ఎందుకు బాసూ?
By: Tupaki Desk | 14 Jan 2017 9:30 AM GMTఏదైనా కూడా ఒకసారి చూస్తే బాగుంటుంది.. రెండోసారి కాస్త యావరేజ్ గా ఉంటుంది.. ఇక మూడోసారికి బోర్ కొడుతుంది. అదేనండీ.. రిపీటెడ్ సినిమా ప్రమోషన్లను చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? దాని గురించే ఈ టాపిక్ అంతా.
ఆల్రెడీ జేమ్స్ బాండ్ లా ఉన్నాడంటూ హీరో విక్రమ్ కొత్త లుక్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న ''ధృవ నట్చత్రమ్'' మూవీలో విక్రమ్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ఆ విషయం ఒక పోస్టర్ తోనే అర్దమైంది. కాని గౌతమ్ మీనన్ మాత్రం.. ఆగస్టు 2017లో రిలీజయ్యే ఈ సినిమాకోసం వరుస పెట్టి పోస్టర్లను రిలీజ్ చేయిస్తూనే ఉన్నాడు. ఇప్పటికి ఇక ఐదు ఆరు డిజైన్లు మార్కెట్లో చెక్కర్లు కొడుతున్నాయి. ఇదేమన్నా బాహుబలి తరహాలో రకరకాల క్యారక్టర్లను ప్రజలకు పరిచయం చేయడం కాదుగా.. ఒకే హీరో కోసం మరీ అన్నేసి పోస్టర్లు ఎందుకు బాసూ?
వినూత్న చిత్రాలను రూపొందించే గౌతమ్ మీనన్.. ఎప్పుడూ తమిళ టైటిల్స్ ను ఎంచుకుని.. తమిళంలోనే లోగో డిజైన్ చేయించి రిలీజ్ చేస్తుంటాడు. కాకపోతే ఈసారి ఇంగ్లీష్ లో రాసిన లెటరింగ్ తో ఈ సినిమా పోస్టర్లను రిలీజ్ చేస్తున్నాడు. అసలు ఈ క్రియేటివ్ క్యాంపెయినింగ్ ఏంటో అర్దమైతే ఒట్టు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/