Begin typing your search above and press return to search.
మోడీతో హీరోయిన్ గౌతమీ భేటీ ఎందుకు
By: Tupaki Desk | 29 Oct 2016 11:12 AM GMTసీనియర్ హీరోయిన్ - లోకనాయకుడు కమల్ హాసన్ భార్య గౌతమి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అవ్వడం రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. దాదాపు నలభై నిమిషాల పాటు గౌతమి మోడీతో ఏకాంతంగా చర్చించారు. గౌతమీ మోడీతో భేటీ అయిన వెంటనే ఆమె బీజేపీలో చేరతారన్న వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్తలు ఇలా ఉంటే గౌతమి మాత్రం తాను నిర్వహిస్తున్న సంస్థ గురించి మాత్రమే మోడీతో చర్చించానని చెపుతున్నారు. గౌతమి చానాళ్లు కేన్సర్ తో బాధపడింది. అయితే, అటు వైద్యుల సపోర్ట్ - ఇటు ఫ్యామిలీ నుంచి వచ్చిన మోరల్ సపోర్ట్ తో ఆమె కోలుకున్నారు.
ఈ క్రమంలో కేన్సర్ తో బాధపడుతున్న రోగులకు ఏమైనా చేయాలని భావించిన గౌతమి స్వచ్ఛంద సేవా మార్గం పట్టారు. దీనికి కమల్ కూడా సహకారం అందిస్తున్నారు. ఈ క్రమంలో తాను నిర్వహించే కార్యక్రమాలకు మోడీ సహకారం కావాలని భావించిన గౌతమి మోడీని కలిసి ఈ విషయాన్ని స్పష్టం చేశారట. ఈ విషయంలో ఆమె మోడీ నుంచి సూచనలు - సలహాలను స్వీకరించారట. ఇక, మోడీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల విషయంలో తాను కూడా అదే విధంగా స్పందిస్తానని గౌతమి చెప్పడం గమనార్హం.
ముఖ్యంగా మోడీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న యోగా దినోత్సవం నాటికి యోగా - ఆరోగ్యంపై ప్రచారం కల్పించడానికి గౌతమీ రెడీ అవుతున్నారట. మోడీతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన గౌతమి.. ప్రధానిని ఆకాశానికి ఎత్తేసింది. రెండేళ్లలో దేశం ఎంతో ప్రగతి పథంలో దూసుకుపోతోందని పొలిటికల్ డైలగులు వల్లెవేసింది. అదేసమయంలో ప్రధాని తనకు సాయం చేస్తారని చెప్పిన విషయాన్నీ వెల్లడించడం గమనార్హం. మరి భవిష్యత్తులో ఈ భేటీ గురించి ఇంకెన్ని చెబుతుందో చూడాలి .
మోడీని కలవడంపై గౌతమి వివరణ ఎలా ఉన్నా ఆమె త్వరలోనే బీజేపీలో చేరతారన్న ప్రచారం జరుగుతోంది. అందుకే మోడీతో ఆమె ఏకంగా 40 నిమిషాలు మాట్లాడారని..మోడీ గురించి ఆకాశానికి ఎత్తేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. గౌతమి సింగిల్ గా బీజేపీలో చేరతారా ? లేదా కమల్ తో కలిసి కాషాయ కండువా కప్పుకుంటారా ? అన్నది కూడా సస్పెన్స్ గా ఉంది. మరి ఈ విషయంలో భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/