Begin typing your search above and press return to search.
కమల్ బాకీ ఉన్నాడన్న గౌతమి
By: Tupaki Desk | 26 Feb 2018 2:55 AM GMTవినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. చాలా కాలం తనతో సహజీవనం సాగించిన కమల్ హాసన్ తో హీరొయిన్ గౌతమి తెగతెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. 13 ఏళ్ళకు పైగా ఉన్న ధృడమైన బంధాన్ని తెంచుకోవడం పట్ల ఫాన్స్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసారు. కమల్ కు మొదటి భార్య సారిక ద్వారా కలిసిన సంతానం శృతి, అక్షర దీనికి కారణమని కొన్ని సార్లు మీడియాలో రాగా మరోసారి శభాష్ నాయుడు షూటింగ్ లో శృతి, గౌతమి గొడవ పడటమే కారణమని మరో వార్త కూడా హల్చల్ చేసింది. దీనికి గౌతమి పూర్తి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. ఆ ఇద్దరు పిల్లలకు తాము విడిపోవడానికి ఎటువంటి సంబంధం లేదన్న గౌతమి కమల్ వ్యవహార శైలి, అతనికున్న కమిట్మెంట్స్ వల్ల తన ఆత్మ గౌరవాన్ని పోగొట్టుకునే పరిస్థితి వచ్చిందని, ఆ బాధను భరించలేకే తెగతెంపులు చేసుకున్నామన్న గౌతం అవి ఏంటి అనేది పూర్తిగా వివరించలేదు.
ఎన్నో ఏళ్ళుగా కమల్ తో పాటు ప్రయాణం చేస్తున్న గౌతమి అతని ప్రతి సినిమాకు పని కూడా చేసారు. దాని గురించి ప్రస్తావిస్తూ దశవతరం టైం నుంచి కమల్ స్వంత బ్యానర్ అయిన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ నుంచి తనకు జీత్వం ఇవ్వలేదని, ఆ బకాయిలు మొత్తం అలాగే పెండింగ్ ఉంచారని కొత్త షాక్ ఇచ్చారు. గౌతమి మాటలు ఇప్పుడు కోలీవుడ్ టాక్ అఫ్ ది టౌన్ గా మారాయి. మార్పు కోసం మంచి కోసం రాజకీయాల్లోకి వచ్చాను అని చెబుతున్న కమల్ తన వ్యక్తిగత జీవితంలోని వారే ఇలా వివాదం చేయటం ఇబ్బంది కలిగించే విషయమే.
గౌతమి మాటలను బట్టి గౌతమి కమల్ వల్ల చాలా ఇబ్బందులు పడిందని, తనకు న్యాయంగా ఇవ్వాల్సిన సినిమా బకాయిలు కూడా ఎగొట్టి రాజకీయాల్లోకి వచ్చి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని అప్పుడే ప్రత్యర్థులు మాటల బాణాలు విసురుతున్నారు. శ్రీదేవి మరణం వల్ల వచ్చిన విషాదంతో ప్రస్తుతం ఈ ఇష్యూ గురించి ఎవరు నోరు విప్పడం లేదు ఓ రెండు రోజులు అయ్యాక ఇది టాప్ హెడ్ లైన్ మారేలా ఉంది.