Begin typing your search above and press return to search.
‘లెజెండ్’ను అందుకున్న శాతకర్ణి’
By: Tupaki Desk | 17 Jan 2017 5:43 PM GMTఇప్పటిదాకా నందమూరి బాలకృష్ణ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అంటే ‘లెజెండ్’. ఆ సినిమా రూ.40 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ సాధించింది. ఆ ఘనతను బాలయ్య లేటెస్ట్ మూవీ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కేవలం ఆరు రోజుల్లోనే అందుకోవడం విశేషం. చిరంజీవి సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ నుంచి గట్టి పోటీ ఉన్నా.. ‘శతమానం భవతి’ కూడా కొంత వరకు పోటీ ఇస్తున్నా గౌతమీపుత్ర శాతకర్ణి అంచనాల్ని మించి బాక్సాఫీస్ లో అదరగొడుతోంది. తొలి ఆరు రోజులకే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.40 కోట్ల షేర్ మార్కును టచ్ చేయడం విశేషం. తెలుగు రాష్ట్రాల వరకే శాతకర్ణి రూ.28 కోట్ల దాకా షేర్ రాబట్టడం విశేషం.
అత్యధికంగా నైజాం ఏరియాలో రూ.6.52 కోట్ల షేర్ సాధించిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’.. సీడెడ్లోనూ దుమ్ముదులుపుతూ రూ.6 కోట్లు కొల్లగొట్టింది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో కలిపి రూ.3.2 కోట్ల షేర్ వచ్చింది. గుంటూరులోనూ అనూహ్యంగా రూ.3.3 కోట్ల షేర్ రాబట్టడం విశేషం. కృష్ణా జిల్లాలో రూ.2.3 కోట్లు.. పశ్చిమగోదావరిలో రూ.2.72 కోట్లు.. తూర్పు గోదావరిలో రూ.2.51 కోట్లు.. నెల్లూరులో రూ.1.6 కోట్లు షేర్ వచ్చింది. ఇక అమెరికాలో స్టడీ కలెక్షన్లతో సాగుతున్న శాతకర్ణి ఆరో రోజుకు రూ.1.2 మిలియన్ మార్కును దాటింది. ఇక్కడ.. కర్ణాటక.. ఇతర ఏరియాలన్నీ కలిపితే షేర్ రూ.40 కోట్ల దాకా ఉంది. ఐతే బ్రేక్ ఈవెన్ కు రావాలంటే ఇంకో పది కోట్ల దాకా వసూలు చేయాలి. అదేమంత కష్టం కాకపోవచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/