Begin typing your search above and press return to search.

అసలు శాతకర్ణి క్లైమాక్స్ ఏంటి?

By:  Tupaki Desk   |   12 Feb 2017 9:23 AM IST
అసలు శాతకర్ణి క్లైమాక్స్ ఏంటి?
X
గౌతమీపుత్ర శాతకర్ణి క్లైమాక్స్ గురించి ఇప్పుడడుగుతారేంటి.. నెల కిందటే సినిమా రిలీజైపోతే అంటారా? ఇక్కడ మాట్లాడుతోంది సినిమా క్లైమాక్స్ గురించి కాదు. ఈ సినిమా బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ విషయంలో క్లైమాక్స్ గురించి. సంక్రాంతికి విడుదలైన మిగతా రెండు సినిమాలకు సంబంధించిన వసూళ్లను ట్రేడ్ వర్గాలు ఎప్పటికప్పుడు అప్ డేట్ చేశాయి. ‘ఖైదీ నెంబర్ 150’ వసూళ్ల గురించి ఒకటికి రెండుసార్లు ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించారు అల్లు అరవింద్. ట్రేడ్ నుంచి కూడా ఎప్పటికప్పుడు వివరాలు బయటికి వచ్చాయి. ఇక సంక్రాంతి రేసులో నిలిచిన ‘శతమానం భవతి’ కలెక్షన్ల అప్ డేట్స్ కూడా పక్కాగానే ఉన్నాయి.

కానీ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లెక్కలే సరిగా తేలలేదు. నిర్మాతలు ఒక్కటంటే ఒక్కసారి కూడా ఈ సినిమా కలెక్షన్ల వివరాలు బయటపెట్టలేదు. ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తయ్యాక కూడా దాని గురించి స్పందించలేదు. ఈ విషయంలో బాలయ్య ఫ్యాన్స్ తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరో ముఖ్య విషయం ఏంటంటే.. ట్రేడ్ నుంచి కూడా ఒక దశ దాటాక ఈ సినిమా కలెక్షన్లపై అప్ డేట్స్ ఆగిపోయాయి. మూడో వీకెండ్ వరకు వివరాలు బయటికి వచ్చాయి కానీ.. ఆ తర్వాత సమాచారం లేదు. చివరగా బయటికొచ్చిన లెక్కల ప్రకారం అప్పటికి ఆ సినిమా రూ.48 కోట్ల దాకా వరల్డ్ వైడ్ షేర్ కలెక్ట్ చేసి.. బ్రేక్ ఈవెన్ (రూ.50 కోట్లు)కు చేరువగా వచ్చింది.