Begin typing your search above and press return to search.
అప్పుడే 21 కోట్ల లాభాలిచ్చేసిన శాతకర్ణి
By: Tupaki Desk | 6 Jan 2017 5:50 AM GMTబాలకృష్ణ వందో చిత్రంగా తెరకెక్కిన గౌతమిపుత్ర శాతకర్ణి.. ఇప్పుడు సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఒక్క కట్ కూడా లేకుండా 2గంటల 15 నిమిషాల డ్యురేషన్ తో యూ/ఏ సర్టిఫికేట్ అందుకుంది శాతకర్ణి. ఈ మూవీని జనవరి 12న విడుదల చేసేందుకు నిర్ణయించగా.. ఇప్పటికే ఆయా థియేటర్ల దగ్గర అభిమానులు కటౌట్లు కట్టే హంగామా మొదలుపెట్టేశారు. విడుదలకు ముందు వంద థియేటర్లలో పతాకోత్సవం అంటూ స్పెషల్ ఈవెంట్ కూడా జరుపనున్నారు నిర్మాతలు.
చారిత్రక చిత్రంగా తెరకెక్కిన గౌతమిపుత్ర శాతకర్ణి.. బాలయ్య కెరీర్ లోనే ఎవ్రీథింగ్ స్పెషల్ అనాల్సిందే. ఆయనకు ఇది వందో చిత్రం అన్నది ఒక కారణం అయినా.. ఈ మూవీకి 55 కోట్లు బడ్జెట్ పెట్టింది ఫస్ట్ ఫ్రేం ఎంటర్టెయిన్మెంట్స్. బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ మూవీ ఇదే. అయితే.. ఇంత బడ్జెట్ పెట్టి మూవీ తీసినా సరే.. నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్ రూపంలోనే ఏకంగా 21 కోట్లు మిగిలిందట. టేబుల్ ప్రాఫిట్స్ విషయంలో బాలకృష్ణ చిత్రాల్లో ఇది అతి పెద్ద రికార్డ్.
అన్ని ఏరియాల నుంచి భారీ ఆఫర్స్ రావడం.. శాటిలైట్ రూపంలో కూడా పెద్ద మొత్తం దక్కడంతో.. హక్కుల రూపంలోనే శాతకర్ణి నిర్మాతలు 21 కోట్లు వెనకేసుకోగలిగారు. ఇప్పటికే ఏరియా రైట్స్ తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎగ్జిబిటర్లకు భారీ మొత్తానికి రీసేల్ చేసేస్తున్నారట. ముఖ్యంగా ఆంధ్ర ఏరియాలో అయితే.. ఈ క్రేజ్ ఇంకా ఎక్కువగా ఉందని తెలుస్తోంది.
గౌతమిపుత్ర శాతకర్ణి మూవీపై ఇప్పటికే సూపర్బ్ బజ్ ఉండడంతో.. టాక్ బాగుంటే మాత్రం.. హక్కులు కొనుక్కున్న వాళ్లందరికీ లైఫ్ టైం అఛీవ్మెంట్ రేంజ్ లో లాభాలు పంచే అవకాశం ఉందంటున్నారు ఇండస్ట్రీ జనాలు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/