Begin typing your search above and press return to search.

బాల‌య్య లేట్ గా రావటం వల్ల లాభం లేదు!!

By:  Tupaki Desk   |   23 Jan 2017 12:58 PM GMT
బాల‌య్య లేట్ గా రావటం వల్ల లాభం లేదు!!
X
మ‌న హీరోలు ప్ర‌మోష‌న్ల‌ను దేశం దాటించేస్తున్నారు ఈ మ‌ధ్య‌. అమెరికాలో మ‌న సినిమాల మార్కెట్ రోజు రోజుకూ విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో అక్క‌డ కూడా ప్ర‌మోష‌న్ల జోరు పెంచుతున్నారు. ఈ మ‌ధ్య రామ్ చ‌ర‌ణ్ త‌న ‘ధృవ సినిమాను అమెరికాలో ప్ర‌మోట్ చేశాడు. మంచి ఫ‌లిత‌మే వ‌చ్చింది. నంద‌మూరి బాల‌కృష్ణ కూడా ఇదే బాట‌లో సాగాడు. ‘గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి’ పోస్ట రిలీజ్ ప్ర‌మోష‌న్ల కోసం అమెరికా వెళ్లాడు. కానీ ఆ ప‌ర్య‌ట‌న వ‌ల్ల పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉన్న‌ట్లుగా క‌నిపించ‌డం లేదు. బాల‌య్య అక్క‌డ ప‌ర్య‌టించ‌డం వ‌ల్ల అద‌నంగా ఏమీ వ‌సూళ్లు వ‌చ్చేయ‌లేదు. రెండో వారాంతంలో ‘గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి’కి ఓ మోస్త‌రు వ‌సూళ్లే వ‌చ్చాయి.

తొలి వారాంతంలోనే మిలియ‌న్ మార్కును అందుకున్న శాత‌క‌ర్ణి.. త‌ర్వాత కూడా స్ట‌డీ క‌లెక్ష‌న్ల‌తో 1.5 మిలియ‌న్ మార్కు దిశ‌గా సాగింది. ఈ ద‌శ‌లో బాల‌య్య ప‌ర్య‌ట‌న ఖ‌రార‌వ‌డంతో ఈ సినిమా 2 మిలియ‌న్ మార్కును అందుకుంటుంద‌న్న అంచ‌నాలు మొద‌ల‌య్యాయి. బాల‌య్య కోసం అభిమానులు భారీగా వ‌స్తార‌ని.. దాని వ‌ల్ల సినిమాకు హైప్ పెరుగుతుంద‌ని.. టికెట్ల రేట్లు కూడా పెంచుతుండ‌టంతో వ‌సూళ్లు బాగా ఉంటాయ‌ని అనుకున్నారు. ఐతే బాల‌య్య హాజ‌రైన కొన్ని షోల‌కు వ‌సూళ్లు బాగానే ఉన్నా.. మిగ‌తా చోట్ల ప‌రిస్థితి అంత గొప్ప‌గా ఏమీ లేదు. ఈ సినిమా 2 మిలియ‌న్ మార్కును అందుకునే అవ‌కాశమే లేద‌ని తేలిపోయింది. బాల‌య్య కొంచెం ముందుగా అమెరికాలో ప‌ర్య‌టించాల్సింద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఫుల్ ర‌న్లో ఈ చిత్రం 1.6 మిలియ‌న్ డాల‌ర్ల ద‌గ్గ‌ర ఆగిపోయేలా ఉంది. ఈ వీకెండ్లో ‘ఎస్‌-3’తో పాటు ‘రాయీస్‌’.. ‘కాబిల్’ సినిమాలు విడుద‌ల‌వుతున్న నేప‌థ్యంలో సంక్రాంతి సినిమాలకు క‌లెక్ష‌న్లు పెద్ద‌గా ఉండ‌క‌పోవ‌చ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/