Begin typing your search above and press return to search.

శాతకర్ణి టీవీలోకి దిగేది ఎప్పుడంటే..

By:  Tupaki Desk   |   25 March 2017 10:56 AM GMT
శాతకర్ణి టీవీలోకి దిగేది ఎప్పుడంటే..
X
ఓ సినిమా థియేటర్లలోకి ఎప్పుడొస్తుందని అభిమానులు ఎంత ఆసక్తి చూపిస్తారో.. టీవీలో ప్రిమియర్ షో కోసం కూడా అంతే ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇంతకుముందు లాగా రిలీజ్ తర్వాత ఏడాదికో రెండేళ్లకో సినిమాను టీవీలో వేసే పరిస్థితి లేదు. రిలీజైన కొన్ని నెలలకే టీవీల్లో టెలికాస్ట్ చేసేస్తున్నారు. గత ఏడాది ‘జనతా గ్యారేజ్’ సినిమాను విడుదలైన 49వ రోజుకే టీవీలో ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై సెన్సేషనల్ హిట్టయిన నందమూరి బాలకృష్ణ వందో సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సైతం విడుదలైన మూడు నెలల లోపే టీవీల్లోకి వచ్చేస్తోంది. కొన్ని రోజులుగా ప్రిమియర్ షో కమింగ్ సూన్ అంటూ ఊరిస్తున్న మా టీవీ.. షో ఎప్పుడో ప్రకటించింది.

మార్చి 29న ఉగాది కానుకగా ఈ చిత్రాన్ని టీవీలో ప్రసారం చేయబోతున్నారు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు మా టీవీలో సినిమా ప్రసారమవుతుంది. విశేషం ఏంటంటే.. అదే రోజు మా మూవీస్ లో సైతం ‘శాతకర్ణి’ సందడి చేస్తుంది. ఆ ఛానెల్లో రాత్రి 9 గంటలకు షో మొదలవుతుంది. అంటే వరుసగా ‘శాతకర్ణి’ రెండు షోలు చూసుకోవచ్చన్నమాట. మామూలుగా కొత్త సినిమాల్ని వీకెండ్లో వేస్తుంటారు. కానీ ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా బుధవారమే వేసేస్తున్నారు. మరి ఈ చిత్రానికి టీఆర్పీ రేటింగ్స్ ఎలా వస్తాయో చూడాలి. బాలయ్య కెరీర్లోనే అత్యధిక బిజినెస్ చేసుకోవడంతో పాటు అత్యధిక వసూళ్లనూ రాబట్టిన ఈ చిత్రం శాటిలైట్ హక్కుల్లోనూ బాలయ్య కెరీర్ రికార్డు సాధించింది. మరి టీఆర్పీల్లో ఎలాంటి రికార్డు నెలకొల్పుతుందో చూద్దాం.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/