Begin typing your search above and press return to search.
శాతకర్ణి సాంగ్ మేకింగ్ అదుర్స్ అంతే
By: Tupaki Desk | 27 Dec 2016 6:21 AM GMTబాలకృష్ణ ల్యాండ్ మార్క్ మూవీ గా గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో ఫంక్షన్ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ట్రైలర్ ను రిలీజ్ చేసేయడం.. రికార్డులు తిరగరాసేయడం జరిగిపోయాయి. ఇప్పుడు పాటలవేడుకలో భాగంగా సాంగ్స్ మేకింగ్ వీడియోలను విడుదల చేసింది శాతకర్ణి టీం.
'సాహో సార్వభౌమ' అంటూ సాగే గౌతమిపుత్ర టైటిల్ సాంగ్ పిక్చరైజేషన్ చూస్తే.. ఇంత తక్కువ కాలంలో ఇన్నేసి ఏర్పాట్లను ఎలా చేసుకోగలిగారా అనిపిస్తుంది. జార్జియా.. మొరకాల్లో చిత్రీకరించిన ఈ పాట.. ప్రధానంగా యుద్ధసన్నివేశాల్లో వస్తుందనే విషయం మేకింగ్ వీడియోలో చూపించారు. యుద్ధం ఒక్కటే ప్రతీ చిన్న అంశానికీ ఎంతేసి జాగ్రత్త తీసుకున్నారో అర్ధమవుతుంది.
'ఘణ ఘణ గంటలు మోగే' అంటూ సాగే పాటను నైట్ ఎఫెక్ట్ లో చిత్రీకరించారు. యుద్ధానికి సన్నద్ధం అవుతున్న సైన్యంతో కలిసి చక్రవర్తి శాతకర్ణి పాడిన పాటగా.. ఈ సాంగ్ కనిపిస్తోంది. యుద్ధానికి సైన్యంలో స్ఫూర్తి నింపడం అన్నట్లుగా సిట్యుయేషనల్ గానే ఈపాట సినిమాలో ఉంటుందని తెలుస్తోంది.
'మృగ నయనా భయమేలనే' అంటూ ఎస్పీ బాలుతో ఓ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించారు. రాజసౌధంలోనే హీరోయిన్ శ్రియతో కలిసి పాడుకునే రొమాంటిక్ సాంగ్ ఇది. కోటను చూపిన విధానం.. బాలయ్య-శ్రియల అభినయం అద్భుతంగా ఉన్నాయి. తెరపై ఈ పాట సూపర్ గా క్లిక్ అవడం ఖాయం అని చెప్పాలి. కేవలం అచ్చ తెలుగు మాటలను మాత్రమే ఉపయోగించి రాసిన పాటలు.. గౌతమిపుత్ర శాతకర్ణికి అసలైన ప్రత్యేకత. పాటలవిషయంలో కూడా గౌతమి పుత్ర శాతకర్ణి కొత్త చరిత్రలు రాయడం ఖాయం అనేంతటి అద్భుతంగా ఉండడం విశేషం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/