Begin typing your search above and press return to search.

శాతకర్ణి.. టార్గెట్ హాఫ్ సెంచరీ

By:  Tupaki Desk   |   7 Jan 2017 4:56 AM GMT
శాతకర్ణి.. టార్గెట్ హాఫ్ సెంచరీ
X
బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 12న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమైంది. మూవీపై బోలెడంత బజ్ ఉండగా.. 8న పతాకోత్సవం అంటూ ప్రీ రిలీజ్ ఫంక్షన్ తో దీన్ని మరింతగా పెంచనున్నారు. బాలయ్యకు సెంచరీ మూవీగా తెరకెక్కిన శాతకర్ణి.. ప్రీరిలీజ్ బిజినెస్ చూస్తే.. బ్రేక్ఈవెన్ కి రావాలంటే కలెక్షన్స్ లో హాఫ్ సెంచరీ కొట్టాల్సిందే.

నైజాం ఏరియా నుంచి థియేట్రికల్ రైట్స్ రూపంలో రూ. 9 కోట్లు రాగా.. సీడెడ్-ఉత్తరాంధ్రలను 12.5 కోట్లకు విక్రయించారు. గుంటూరు-కృష్ణా జిల్లాలు కలిపి 7.7 కోట్లు.. ఈస్ట్ 3.2 కోట్లు.. వెస్ట్ గోదావరి 2.8 కోట్లు.. నెల్లూరు 2 కోట్లు పలికింది. అంటే కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే థియేట్రికల్ రైట్స్ రూపంలో రూ. 37.2 కోట్లు వచ్చాయన్న మాట. ఇక కర్నాటక నుంచి 3.8 కోట్లు.. యూఎస్ఏ నుంచి 4 కోట్లు రాగా.. రెస్టాఫ్ ఇండియా-ఇతర ఏరియాలు కలిపి 1.8 కోట్లకు రైట్స్ విక్రయించారు.

మొత్తం మీద గౌతమిపుత్ర శాతకర్ణి ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 46.8 కోట్లు జరిగింది. ఈ మొత్తం రికవరీ కావాలంటే కనీసం 50కోట్ల రూపాయల మార్క్ ను బాలయ్య అందుకోవాల్సిందే. ఇప్పటివరకూ రైట్స్ రూపంలో అయినా.. కలెక్షన్స్ మార్క్ లో అయినా బాలకృష్ణకు ఇదే అత్యధికం. అయితే.. మూవీ బాగుందనే టాక్ వస్తే మాత్రం ఇదేమీ అంత కష్టమైన టార్గెట్ కాదని.. బాలయ్య స్టామినా.. సంక్రాంతి సీజన్ రెండూ కలిసి వస్తాయ్ కాబట్టి.. తేలికగానే రికవరీ అయిపోతుందని ట్రేడ్ జనాలు అంచనా వేస్తున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/