Begin typing your search above and press return to search.

శాత‌క‌ర్ణి పాట విన్నారా?

By:  Tupaki Desk   |   9 May 2016 4:36 AM GMT
శాత‌క‌ర్ణి పాట విన్నారా?
X
ఇప్ప‌టిదాకా ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్ల‌నీ - ఫ్యాన్ మేడ్ టీజ‌ర్ల‌నీ విన్నాం. ఇక నుంచి ఫ్యాన్ మేడ్ సాంగ్స్ కూడా వినాల్సుంటుందేమో. స్టార్ల సినిమాల‌కి సంబంధించి పేరో లేక గెట‌ప్పు గురించో కాస్త తెలిసిన‌ప్పుడు అభిమానులు త‌మ మేథ‌స్సుని ప‌నిపెట్టి పోస్ట‌ర్లు - టీజ‌ర్లు త‌యారు చేసి వ‌దులుతుంటారు. అవి కొన్నిసార్లు సినిమా యూనిట్ విడుద‌ల చేసిన టీజ‌ర్లంత క్వాలిటీగా అనిపిస్తుంటాయి. నిజంగా చిత్ర‌బృందం టీజ‌ర్ విడుద‌ల చేసేంత‌వ‌ర‌కు వాటినే ఆస్వాదిస్తూ ఆనందిస్తుంటారు అభిమానులు. అయితే తొలిసారి గౌత‌మీ పుత్ర శాత‌కర్ణి కోసం ఫ్యాన్‌ మేడ్ సాంగ్ త‌యారైంది. గీత ర‌చ‌యిత సిరాశ్రీ ఆ పాట‌ని ర‌చించాడు. కిల్లింగ్ వీర‌ప్ప‌న్‌ - ఎటాక్ సినిమాల‌కి సంగీతం అందించిన ర‌విశంక‌ర్ ట్యూన్ క‌ట్టాడు. రోహిత్ పాడాడు. ఆ పాట శాత‌క‌ర్ణి పాశ‌స్త్వం గురించి చెబుతూ సాగుతుంది.

సినిమాలో వాడుకొనేంత క్వాలిటీగా వుంది ఆ పాట‌. సినిమాకి సంబంధించిన ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లోనూ - బాల‌య్య‌కి సంబంధించి ఇత‌రత్రా విష‌యాల్లోనూ ఆ పాట వినిపించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అయితే సినిమాకీ, పాట‌కీ సంబంధ‌మేమీ లేద‌నీ... ఇది కేవ‌లం గౌర‌వ సూచ‌కంగా మాత్ర‌మే త‌యారు చేసింద‌ని గేయ ర‌చ‌యిత సిరాశ్రీ చెప్పుకొచ్చాడు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథసత్యనారాయణగారు రాసిన ఆంధ్రప్రశస్తిలో గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించిన‌ లఘుకావ్యం చ‌దివాక సిరాశ్రీకి ఈ పాట రాయాల‌నిపించింద‌ట‌. రోమాంఛితమైన ఇంతటి గొప్ప చిత్రాన్ని తీస్తున్న దర్శకులు క్రిష్ గారికి, నటిస్తున్న బాలకృష్ణ గారికి తెలుగుజాతి ఎప్పటికీ ఋణపడి ఉంటుందని సిరాశ్రీ చెప్పారు. బాల‌కృష్ణ క‌థానాయడిగా న‌టిస్తున్న గౌత‌మ పుత్ర శాత‌క‌ర్ణి చిత్రీక‌ర‌ణ ఈ రోజునుంచి మొరాకోలో మొద‌ల‌వుతోంది.