Begin typing your search above and press return to search.
గౌతమ్ మీనన్ హీరోయిన్ తో వున్న రిలేషన్ షిప్ ని చెప్పేశాడు!
By: Tupaki Desk | 31 Oct 2022 5:35 PM GMTలవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ గౌతమ్ మీనన్ తెరకెక్కించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ `సాహసం శ్వాసగా సాగిపో`. నాగచైతన్య హీరోగా నటించిన ఈ మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బబ్లీ బ్యూటీ మంజిమ మోహన్. ఈ మూవీ తరువాత తెలుగు సినిమాల్లో కనిపించని ఈ మలయాళీ సోయగం మలయాళ, తమిళ చిత్రాల్లో నటిస్తూ యమ బిజీగా వుంది. అయితే తను లవ్ లో వుందని, గత కొంత కాలంగా తమిళ హీరోతో ప్రేమాయణం సాగిస్తోందంటూ వార్తలు మొదలయ్యాయి.
`అభినందన` ఫేమ్ కార్తీక్ తనయుడు గౌతమ్ కార్తీక్, మంజిమ మోహన్ ప్రేమలో వున్నారంటే కోలీవుడ్ లో గత కొంత కాలంగా వరుస కథనాలు వినిపిస్తున్నాయి. దీనిపై గౌతమ్ కార్తీక్ కానీ, మంజిమ మోహన్ కానీ ఎలాంటి వివరణ ఇవ్వకపోగా తమపై వస్తున్న వార్తలని ఖండించలేదు. దీంతో ఈ వార్తల్లో నిజం వుందని అంతా భావించడం మొదలు పెట్టారు. తాజాగా ఆ వార్తలని నిజం చేస్తూ తమ మధ్య వున్ బంధాన్ని సోషల్ మీడియా వేదికగా హీరో గౌతమ్ కార్తీక్ సోమవారం ఓ ఆసక్తికరమైన పోస్ట్ తో వెల్లడించి షాక్ ఇచ్చాడు.
ఆసక్తికరమైన పోస్ట్ తో పాటు మంజిమ మోహన్ కలిసి వున్న ఫొటోలని షేర్ చేసి గౌతమ్ కార్తీక్ మరింత క్లారిటీ ఇచ్చాడు. `సరైన వ్యక్తి మీ జీవితంలోకి వస్తే ఏమి జరుగుతుంది? మఈరు వారిఒపై దృష్టి పెట్టిన వెంటనే మీరు ప్రేమతో నిండిపోతారని చాలా మంది చెబుతారు. మీ గుండెలో సీతాకోక చిలుకలు ఎగురుతున్నట్టు మీ కడుపు ఆనందంతో నిండిపోయిన అనుభూతికి లోనవుతారు.
మంజిమ మోహన్, మా ప్రయాణం ఖచ్చితంగా భిన్నమైనది. మేము ఎల్లప్పుడూ ఒకరినొకరు చిలిపిగా అల్లరి చేసుకోవడం.. గిల్లికజ్జాలు పడటం.. తెలివి తక్కువ విషయాలపై వాదించుకోవడంతో మా బంధాన్ని ప్రారంభించాం. మా స్నేహితులు కూడా మా వాదనలని నమ్మోవారు కాదు. ఇద్దరం కలిసి ఒక్కటిగా ప్రయాణం చేయడానికి వేచి వుండలేకపోతున్నాం` అంటూ సుధీర్గమైన పోస్ట్ ని షేర్ చేసి తమ బంధంపై నెలకొన్న సస్పెన్స్ కు క్లారిటీ ఇచ్చాడు.
ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. గౌతమ్ కార్తీక్, మంజిమ మోహన్ ఇద్దరు కలిసి 2019లలో ఎం. ముత్తయ్య రూపొందించిన `దేవరాట్టం`లో నటించారు. ఇదే సినిమా టైమ్ లో ఇద్దరి మధ్య మంచి బాండింగ్ కుదిరింది. అదే ప్రేమకు దారితీసిందట. అప్పటి నుంచి రహస్యంగా ప్రేమలో వున్న ఈ జంట ఎట్టకేలకు తమ ప్రేమ బంధాన్ని బటయపెట్టడం విశేషం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.