Begin typing your search above and press return to search.
మహేష్ కొడుకు రోల్ అడుగుతున్నాడట
By: Tupaki Desk | 29 Nov 2015 7:30 AM GMTమొదట్లో మహేష్ ని నటించమని అడిగితే సెట్ నుంచి పరిగెత్తేవాడట. బాగా షై పర్సన్ అయిన మహేష్ కి చిన్నప్పుడు నటనపై అంత ఆసక్తి ఉండేది కాదట. అందుకే అలా చేసేవాడట. కానీ రెండు మూడు సినిమాల తర్వాత ఆయనకే నటనపై మక్కువ పెరిగిందట. అందుకే తండ్రి కృష్ణ - సోదరుడు రమేష్ బాబుతో కలిసి పలు చిత్రాల్లో నటించాడు. అయితే మహేష్ కొడుకు గౌతమ్ కి మాత్రం నటన అంటే పిచ్చి. తన తండ్రి మహేష్ సినిమాల్ని చూసి అంతగా ఇంప్రెస్ అయ్యాడన్నమాట. ఆ అభిరుచినీ - ఆసక్తిని తెలుసుకొన్న మహేష్ `1` (నేనొక్కడినే) చిత్రంతో గౌతమ్ ని తెరపైకి తీసుకొచ్చాడు. ఆ సినిమాలో గౌతమ్ తనని తాను చూసుకొని తెగ మురిసిపోతుంటాడట. ఆ విషయాన్ని స్వతహాగా మహేషే చెబుతుంటాడు. అందులో గౌతమ్ నటనకి మా టీవీ అవార్డు కూడా వచ్చింది. ఆ అవార్డుకోసం ఇంట్లో సపరేట్ గా ఓ ర్యాక్ ని ఏర్పాటు చేసుకొని దాంట్లో పెట్టుకొన్నాట గౌతమ్.
అయితే అలాంటి మరో అవార్డు కూడా తెచ్చుకోవాలనుకొంటున్నాడో ఏంటో మరి... `మీ కొత్త సినిమాలో నాకేమైనా రోల్ ఉందా?` అని తరచుగా తన తండ్రి మహేష్ ని అడుగుతుంటాడట గౌతమ్. ఆ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు మహేష్. సినిమాలో రోల్ ఉన్నదీ లేనిదీ తనకి మాత్రం ఏం తెలుసనీ... అందుకే నాకూ తెలియదు అని చెబుతుంటానని మహేష్ స్పష్టం చేశాడు. నటనపై తనకి అంత ఆసక్తి ఎలా కలిగిందని మహేష్ ని అడిగితే... అది ఆసక్తో లేక స్కూలుకి బంక్ కొట్టాలని అడుగున్నాడో నాకు మాత్రం తెలియదని నవ్వుతూ చెప్పుకొచ్చాడు మహేష్. కానీ తనకి ఏది ఇష్టమైతే అది చేయించడమే నా కర్తవ్యమని... నా దృష్టిలో నేను మంచి తండ్రిననీ, గౌతమ్ తోనూ, సితారతోనూ ఫ్రెండ్ లా నడుచుకుంటానని చెప్పుకొచ్చాడు మహేష్.