Begin typing your search above and press return to search.
ఔను సీక్వెల్స్ నిజమే... అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి
By: Tupaki Desk | 19 Sep 2022 5:12 AM GMTవిభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్న గౌతమ్ వాసుదేవ్ మీనన్ తాజాగా శింబు తో తెరకెక్కించిన లైఫ్ ఆఫ్ ముత్తు సినిమా ప్రమోషన్ కార్యక్రమాల కోసం హైదరాబాద్ వచ్చాడు. ఇక్కడ పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇవ్వడంతో పాటు తన టాలీవుడ్ ఫ్యూచర్ ప్లాన్స్ ని గురించి కూడా దర్శకుడు ఆసక్తికర విషయాలను వెళ్లడించాడు.
గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్న ఘర్షణ సినిమా యొక్క సీక్వెల్ గురించి కూడా గౌతమ్ వాసు దేవ్ మీనన్ క్లారిటీ ఇవ్వడంతో వెంకటేష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన ఒకటి కాదు రెండు రీమేక్ ల విషయంలో స్పష్టత ను ఇచ్చాడు. ఆ రెండు సీక్వెల్స్ కి సంబంధించిన క్లారిటీ దర్శకుడు గౌతమ్ మీనన్ నుండి రావడంతో పుకార్లకు చెక్ పెట్టినట్లు అయ్యింది.
ముఖ్యంగా వెంకటేష్ తో ఘర్షణ సీక్వెల్ గురించి సంప్రదించగా త్వరలోనే మీకు ఒక మంచి గుడ్ న్యూస్ అందనుంది అన్నట్టుగా ఆ విషయమై చెప్పుకొచ్చాడు. వెంకటేష్ గారిని ఘర్షణ సీక్వెల్ కోసం సంప్రదించాను. ఆయన చాలా సానుకూలంగా ఉన్నారు. తప్పకుండా సీక్వెల్ చేద్దాం అన్నట్లుగా ఆయన నుండి స్పందన వచ్చింది. త్వరలోనే సీక్వెల్ మొదలు పెడతాను అన్నాడు.
అయితే ఇప్పటి వరకు ఘర్షణ కి సంబంధించిన సీక్వెల్ కి తాను స్క్రిప్ట్ రెడీ చేయలేదు అన్నాడు. ప్రస్తుతం ఉన్న కమిట్ మెంట్స్ పూర్తి చేసిన తర్వాత ఘర్షణ 2 యొక్క సీక్వెల్ ని మొదలు పెట్టబోతున్నట్లుగా దర్శకుడు పేర్కొన్నాడు. అంతే కాకుండా కమల్ హాసన్ తో రాఘవన్ సినిమాకు కూడా సీక్వెల్ ను చేయబోతున్నాను అని.. దానికి కూడా కమల్ హాసన్ గారి నుండి గ్రీన్ సిగ్నల్ అందింది అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.
తాజాగా విడుదల అయిన ముత్తు సినిమాకు తమిళంలో మంచి టాక్ దక్కింది. తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదు అన్నట్లుగా టాక్ వచ్చింది. దాంతో గౌతమ్ మీనన్ తన తదుపరి సినిమా విషయంలో మరింత స్పీడ్ ను పెంచే అవకాశం ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం అందుతోంది.
రాబోయే రెండు మూడు ఏళ్లలో తెలుగు లో గౌతమ్ మీనన్ వరుసగా సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఆయన మాటలను బట్టి అర్థం అవుతోంది. తమిళంతో పాటు తెలుగు లో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. కనుక ఆయన ఇక్కడ తీసి పాన్ ఇండియా స్థాయిలో సినిమాలను విడుదల చేస్తే బాగుంటుందనే అభిప్రాయం ను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.