Begin typing your search above and press return to search.
మళ్లీ సూపర్ హిట్ కాంబినేషన్
By: Tupaki Desk | 17 Jan 2018 6:13 AM GMTతమిళనాట తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో అజిత్ ఒకడు. అతడి ఫ్లాప్ సినిమాలు కూడా ఈజీగా వంద కోట్ల వసూళ్లు సాధిస్తాయంటే అతడి రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అజిత్ చివరగా నటించిన ‘వివేగం’ ఫ్లాప్ టాక్ తెచ్చుకుని కూడా రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. దీని తర్వాత అజిత్ మళ్లీ ‘వివేగం’ దర్శకుడు శివతో కలిసి ‘విశ్వాసం’ అనే సినిమా చేస్తున్నాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో రాబోతున్న నాలుగో సినిమా ఇది. ఈ సినిమా ప్రి ప్రొడక్షన్ దశలో ఉండగానే అజిత్ తన తర్వాతి సినిమా ఫిక్సయ్యాడు. విలక్షణ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అజిత్ మళ్లీ ఓ సినిమా చేయబోతున్నాడు.
గౌతమ్ దర్శకత్వంలో ఇంతకుముందు అజిత్ ‘ఎన్నై అరిందాల్’ (తెలుగులో ఎంతవాడు గాని) సినిమా చేశాడు. అది సూపర్ హిట్టయింది. ఎప్పుడూ రొటీన్ సినిమాలు చేసే అజిత్ కు అది భిన్నమైన చిత్రంగా నిలిచింది. అందులో అజిత్ నటన కూడా అదిరిపోయిందనే పేరొచ్చింది. అతడిని భిన్నంగా ప్రెజెంట్ చేశాడు గౌతమ్. ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్ అనగానే అజిత్ అభిమానులు చాలా సంతోషంతో ఉన్నారు. గౌతమ్ ప్రస్తుతం ఒకేసారి రెండు సినిమాల్ని సమాంతరంగా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ధనుష్ హీరోగా ‘ఎన్నై నొక్కి పాయు తోటా’ అనే సినిమాతో పాటు విక్రమ్ హీరోగా ‘ధృవ నక్షత్రం’ అనే చిత్రం తీస్తున్నాడు. ఈ రెండు సినిమాలూ ఈ ఏడాదే రిలీజవుతాయి. దీంతో పాటు యువ దర్శకుడు కార్తీక్ నరేన్‌తో ‘నరకాసురన్’ (తెలుగులో నరకాసురుడు) అనే చిత్రాన్ని గౌతమ్ నిర్మించాడు.