Begin typing your search above and press return to search.

ఆ చైతూ.. ఈ చైతూ.. చాలా తేడా ఉంది

By:  Tupaki Desk   |   30 Aug 2015 9:56 AM GMT
ఆ చైతూ.. ఈ చైతూ.. చాలా తేడా ఉంది
X
‘ఏమాయ చేసావె’లో నటించిన నాగచైతన్యకు.. ‘సాహసం శ్వాసగా సాగిపో’లో చేసిన నాగచైతన్యకు చాలా తేడా ఉందని.. అది ప్రేక్షకులకు తెరమీదే చూసి తెలుసుకుంటారని అన్నాడు డైరెక్టర్ గౌతమ్ మీనన్. షూటింగ్ సమయంలోనే తాను చైతూలో ఎంతో మార్పు గమనించానని గౌతమ్ చెప్పాడు. ‘‘ఏమాయ చేసావె టైంకి చైతూ సినిమాల్లో తొలి అడుగులు వేస్తున్నాడు. నా మీద ఎక్కువ ఆధారపడే వాడు. ప్రతి చిన్న విషయం చెప్పాల్సి వచ్చేది. కానీ ‘సాహసం శ్వాసగా సాగిపో’ చేసే సమయానికి తనలో చాలా మార్పు గమనించా. ఎంతో మెచ్యూరిటీ వచ్చింది. ఏదీ విడమరిచి చెప్పాల్సిన పని లేదు. స్క్రిప్టు అర్థం చేసుకుని తన స్టయిల్లో ఓన్ గా చేయడానికి ట్రై చేయడం గమనించాను. తను చాలా చాలా మారాడు. నటుడిగా ఎంతో పరిణతి సాధించాడు’’ అని గౌతమ్ చెప్పాడు.

గౌతమ్ చాలా వరకు తన సినిమాల్ని తమిళంలో, తెలుగులో వేర్వేరు నటీనటులతో వేర్వేరుగా తీస్తాడన్న సంగతి తెలిసిందే. సాహసం శ్వాసగా సాగిపో కూడా ఆ తరహా సినిమానే. ఇదే సినిమాను శింబుతో తమిళంలో తీస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఓ సినిమాను ఒకేసారి రెండు వెర్షన్లలో తీస్తుంటే నటీనటులకు చాలా విసుగ్గా ఉంటుందని.. వేరే వెర్షన్ షూట్ చేస్తున్నపుడు వెయిట్ చేయడం చాలా కష్టమైన పని అని గౌతమ్ చెప్పాడు. ‘‘నేను పర్ఫెక్షన్ కోసం ట్రై చేస్తుంటాను. దాని వల్ల సన్నివేశం లేటవ్వచ్చు. తెలుగుదైనా, తమిళందైనా ప్రతి సన్నివేశం ఒకే లొకేషన్ లో తీయాల్సి ఉంటుంది. అలాంటపుడు యాక్టర్స్ కి చాలా ఓపిక ఉండాలి. ఒక్కోసారి తమిళం సీన్ ముందు తీస్తా. ఒక్కోసారి తెలుగుది తీస్తా. నటీనటులు చాలా సేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో నాకు శింబు విషయంలో నాకు సమస్య లేదు. ఎందుకంటే నాకతను చాలా క్లోజ్ ఫ్రెండ్. అందుకే నా దృష్టంతా చైతూ మీదే ఉండేది. అతణ్ని ప్రొటెక్ట్ చేయాల్సి వచ్చేది. అతడేమైనా ఇబ్బంది పడుతున్నాడా అని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాను’’ అని గౌతమ్ చెప్పాడు.