Begin typing your search above and press return to search.
క్యాస్టింగ్ కౌచ్?? వ్యక్తిగత నిర్ణయం
By: Tupaki Desk | 4 July 2017 4:39 AM GMTకమల్ హాసన్ తో 13 ఏళ్లపాటు సహజీవనం చేసిన గౌతమి.. రీసెంట్ గా ఆయనతో విడిపోయారు. ఈ నిర్ణయం తీసుకునేందుకు రెండేళ్లు ఆలోచించానంటున్న ఆమె.. సహజీవనంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
'సాంప్రదాయానికి ఇది సానుకూలం.. ఇది వ్యతిరేకం అనేవేవీ ఉండవు. ఎప్పుడైనా సరే మానవ సంబంధాలే ముఖ్యం. ఒకలా ఉండే వారికి ఇంకొకటి తప్పుగా కనిపిస్తాయంతే. పెళ్లితో పాటు ఉపాధ్యాయుడు-విద్యార్ధి.. సోదరి-సోదరుడు.. పేరెంట్స్-పిల్లలు.. సహోద్యోగులు.. ఇలా ఎక్కడైనా రిలేషన్ లో కమిట్మెంట్ చాలా ముఖ్యం. ఒకరిపై ఒకరికి గౌరవం ఉండడం ఇంకా ముఖ్యం. ఒకరికి ఒకరు గౌరవం ఇచ్చుకుని అనుబంధంలోకి వెళ్లాలి. దానికి సహజీవనం లాంటి ఎలాంటి పేర్లు పెట్టినా నాకేమీ అభ్యంతరం లేదు' అన్నారు గౌతమి.
ఇక ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే మాట ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తోంది. దీనికి 'ఇవాల్టి రోజున క్యాస్టింగ్ కౌచ్ అంటే అందరికీ తెలుసు. సినిమాల్లోనే కాదు.. ఇది ప్రతీ చోటా ఉంది. మన జీవితంలో దాన్ని ఎంతవరకూ అంగీకరిస్తామన్నదే పాయింట్. కొన్ని పనులు జరగడానికి మనం కొన్ని స్టాండర్డ్స్ వదిలేస్తాం. మరికొన్ని చోట్ల రాజీ పడతాం. ఇలా అడ్జస్ట్ అడం అనేది మన వ్యక్తిగత నిర్ణయం. అలా రాజీ పడ్డం కారణంగా వచ్చే ఫలితాలను అందుకోవడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అనే విషయంపై ముందుగా నిర్ణయం తీసుకోవాలి' అంటూ క్యాస్టింగ్ కౌచ్ కు తనదైన భాష్యం చెప్పారు గౌతమి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/