Begin typing your search above and press return to search.

45 ఏళ్ళ లేడీ 25 లోకి వస్తే...

By:  Tupaki Desk   |   12 Oct 2015 4:17 AM GMT
45 ఏళ్ళ లేడీ 25 లోకి వస్తే...
X
ఇటీవ‌లి కాలంలో ఓ ఇద్ద‌రు స్టార్ హీరోయిన్‌ లు దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌ల్లోకి వ‌చ్చారు. ఈ ఇద్ద‌రూ ఓ రెండు రీజ‌న్స్‌ తో జ‌నాల నోళ్ల‌లో నానారు. ఒక‌టి ఫ్యాష‌న్ - శ‌రీరాకృతి - రెండోది వ్య‌క్తిగ‌త నేప‌థ్యం.

బాలీవుడ్‌ లో స్టార్ హీరోయిన్‌ గా హ‌వా సాగించిన ఐశ్వ‌ర్యారాయ్ అభిషేక్ బ‌చ్చ‌న్ ని పెళ్లాడి ఓ బిడ్డ‌కు త‌ల్లి అయ్యింది. ఆ క్ర‌మంలోనే ఐసూ రూపురేఖ‌లు పూర్తిగా మారిపోయాయి. ఆంటీ షేపులొచ్చేశాయే అని కామెంట్లు వినిపించాయి. అయితే ఐశ్వ‌ర్యారాయ్ అమ్మ‌గా బాధ్య‌త‌లు తీసుకున్న టైమ్‌లో ఆంటీగారినే త‌ల‌పించినా.. ఇప్ప‌డు మ‌ళ్లీ షోబిజ్‌ లోకి అఫీషియ‌ల్ ఎంట్రీ ఇచ్చేట‌ప్ప‌టికి పూర్తిగా స్లిమ్ అయిపోయి 18 వ‌య‌సు టీనేజీ అమ్మాయిలా మారిపోయింది. జిమ్మింగ్‌ - యోగా - డైట్ ఇత‌ర‌త్రా జాగ్ర‌త్త‌లు పాటించి పూర్తిగా న‌వ‌య‌వ్వ‌నాన్ని సంత‌రించుకుంది. ఇటీవ‌లి కాలంలో విస్ర్తంగా చ‌ర్చ‌కొచ్చిన పాయింట్ ఇది.

స‌రిగ్గా ఇదే టైమ్‌ లో సౌత్ హీరోయిన్‌ - అల‌నాటి మేటి నాయిక గౌత‌మి కూడా న్యూస్ హెడ్‌ లైన్స్‌ లోకి వ‌చ్చారు. ఈ మధ్యనే క‌మ‌ల్ హాస‌న్ స‌ర‌స‌న పాప‌నాశం సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన గౌత‌మి అభిమానుల్ని అల‌రించారు. పాతిక ప్రాయంలో వెండితెర‌పై హీరోయిన్‌ గా వెలిగిపోయిన గౌత‌మి 45 వ‌య‌సులో తిరిగి ముఖానికి రంగేసుకుని విజ‌యం అందుకోవ‌డం విస్తృతంగా చ‌ర్చ‌కొచ్చింది. డేంజరస్‌ క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారీని జ‌యించి, ఇప్పుడు ఇలా తిరిగి న‌టిగా కెరీర్ రీస్టార్ట్ చేయ‌డం అంద‌రికీ ఇన్‌ స్పిరేష‌న్ అయ్యింది. అయితే ఆ విజ‌యాన్ని ఒక్క సినిమాతోనే ప‌రిమితం చేయ‌ద‌ల‌చుకోలేదు గౌత‌మి.

ఇప్పుడు బాగా స్లిమ్‌ అయ్యి ఓ స‌రికొత్త ఫోటోషూట్‌ తో విచ్చేసింది. చూస్తుంటే ఆమె వ‌య‌సు దాదాపు స‌గానికి స‌గం త‌గ్గిపోయింది. 25 ఏళ్ల హాట్‌ యూత్‌ లా క‌నిపిస్తోంది. తిరిగి ఇప్పుడు హీరోయిన్‌ గా చేసినా కూడా రచ్చ చేయడం ఖాయం అనిపిస్తోంది ఈ హాట్‌ నెస్‌ చూస్తుంటే...