Begin typing your search above and press return to search.
వందరోజులు సెక్స్ లేకుండా ఉంటావా? బిగ్ బాస్ షో పై మరో షాకింగ్ న్యూస్
By: Tupaki Desk | 13 July 2019 8:58 AM GMTబిగ్ బాస్ షో! తెలుగు టీవీ రంగంలో సంచలనాలకు వేదిక అయిన ఈషో.. మొదట్లోనే బాగానే అలరించినా.. తాజాగా దీనిపై వస్తున్న ఆరోపణలు మాత్రం అంతకన్నాఎక్కువగా సంచలనాలను వేదిక అవుతున్నాయి. నిన్ననే సీనియర్ జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి బిగ్ బాస్ షో పై సంచలన విమర్శలు చేశారు. ఇప్పటికే రెండు సెషన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో.. మూడో సెషన్ కు పరుగులు పెడుతోంది. అయితే, ఈ క్రమంలో దీనిలో పార్టిసిపేట్ చేసేవారి ఎంపికలు జరుగుతున్న క్రమంలో చోటు చేసుకున్న ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ యాంకర్- జర్నలిస్ట్.. శ్వేతారెడ్డి మీడియా ముందుకు వచ్చారు.
తనకు ఈ షోలో ఆఫర్ వచ్చిందని, అయితే, నువ్వు బిగ్ బాస్ ను ఎలా ఇంప్రెస్ చేస్తావంటూ.. ప్రశ్నించారని, క్యాస్టింగ్ కౌచ్ కు ఇది పక్కా నిదర్శనమని, బ్రోతల్ హౌస్ నడుపుతున్నారని, తనకు విషయం తెలిసి బయటకు వచ్చానని, దీనిపై మహిళా సంఘాలను కూడదీసి పోరాటం చేస్తానని ఆమె ప్రకటించారు. ఇది జరిగి 24 గంటలు కాకముందే.. ఇలాంటి సంఘటనే మరొకటి వెలుగు చూసింది. ఏకంగా బిగ్ బాస్ లో ఆఫర్ వచ్చిన నటి, ఫిదా ఫేం.. గాయత్రి గుప్తా కూడా తన అనుభవాలను సోషల్ మీడియలో పంచుకుని విమర్శలు గుప్పించారు. తనకు బిగ్ బాస్-2లో ఆఫర్ వచ్చిందని, ఈ క్రమంలో తాను ఇంటర్వ్యూకు వెళ్లానని చెప్పుకొచ్చింది.
అయితే, తనను నేరుగా అక్కడి వారు వంద రోజులు సెక్స్ కు దూరంగా ఉండగలవా? వంద రోజుల పాటు సెక్స్ ను ఎలా మేనేజ్ చేస్తావంటూ ప్రశ్నించారని వెల్లడించింది. దీంతో తాను ఈ షోలో పార్టిసిపేట్ చేయలేదని చెప్పుకొచ్చింది. అంతేకాదు, ‘‘బిగ్ బాస్' ఆఫర్ క్యాన్సిల్ అయిన తర్వాత హౌస్ లోకి వెళ్లిన నా ఫ్రెండ్స్ ను హౌస్ లో ఎలా ఉంటుంది..? లోపల ఏం జరుగుతుంది..? అని అడిగాను. వాళ్లంతా.. క్యాన్సిల్ అయిందే మంచిదైంది అన్నారు. అక్కడ ఏం జరిగిందో అది ప్రసారం చేయరని.. వాళ్లు ఏం చూపించాలనుకుంటున్నారో అదే ప్లే చేస్తారు. నువ్వు ఎలా ఉన్నావో అది బయటకు వస్తుందన్న గ్యారెంటీ లేదు'' అని చెప్పారని గుప్తా వివరించింది. ఈ పరిణామాలు బిగ్ బాస్ షోపై మరిన్ని సందేహాలకు తావిస్తున్నాయి.