Begin typing your search above and press return to search.

పుష్ప 2కి రంగం సిద్ధం… సిద్ధమవుతున్న కత్తులు

By:  Tupaki Desk   |   21 Jan 2023 4:00 AM GMT
పుష్ప 2కి రంగం సిద్ధం… సిద్ధమవుతున్న కత్తులు
X
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే పుష్ప 2కి రంగం సిద్ధం అవుతుంది. పుష్పకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఈ కథని దర్శకుడు సుకుమార్ ఎలా నడిపించబోతున్నాడు అనేది తెలుసుకోవడానికి పుష్ప ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలా రోజుల నుంచి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఫైనల్ గా షూటింగ్ సమయం రానే వచ్చింది. తాజాగా అల్లు అర్జున్ విశాఖలో అడుగుపెట్టాడు. పుష్ప 2 ఫస్ట్ షెడ్యుల్ విశాఖలోనే సుకుమార్ మొదలు పెట్టబోతున్నాడు. హార్బర్ బ్యాక్ డ్రాప్ లో కీలకమైన యాక్షన్ ఘట్టాలని తెరకెక్కించే పనిలో సుకుమార్ ఉన్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే అల్లు అర్జున్ ఇప్పటికే విశాఖ చేరుకున్నాడు. అక్కడ ఓ పది రోజుల పాటు షూటింగ్ జరగనుందని తెలుస్తుంది. అక్కడ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో షూటింగ్ జరుగనున్నట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో యాక్షన్ ఘట్టాల కోసం ఆర్ట్ డైరెక్టర్ పర్యవేక్షణలో కత్తులని సిద్ధం చేస్తున్నారు. అలాగే ఎర్రచందనం దుంగలని కూడా సిద్ధం చేశారు. వీటికి సంబందించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ ఫోటోలు చూసిన తర్వాత పుష్ప 2 మూవీ షూటింగ్ మొదలవుతుందనే క్లారిటీ అందరికి వచ్చింది. ఇన్ని రోజుల ఎదురుచూపులకి తెరపడినట్లు అయ్యింది. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితమే రష్మిక మందన పుష్ప 2 మూవీ షూటింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో సీనియర్ హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ జగపతి బాబు ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. అయితే అతను చేయబోయే పాత్రని సస్పెన్స్ గా ఉంచబోతున్నారని టాక్ వినిపిస్తుంది.

మరి ఇందులో వాస్తవం ఏంటి అనేది తెలియాల్సి ఉంది. అలాగే రష్మికతో పాటు మరో హీరోయిన్ కూడా పుష్ప 2లో ఛాన్స్ ఉందనే మాట వినిపించింది సాయి పల్లవిని ఆ పాత్ర కోసం ఎంపిక చేసినట్లు టాక్ నడిచింది. ఇక బాలీవుడ్ సీనియర్ హీరోని కూడా ఈ సినిమాలో ఒక పాత్ర కోసం ఎంపిక చేసారని ప్రచారం నడిచింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.