Begin typing your search above and press return to search.
'మహర్షి' వెనక బన్ని-ప్రభాస్!
By: Tupaki Desk | 5 May 2019 5:12 PM GMTఅవునా? సూపర్ స్టార్ మహేష్ నటించిన `మహర్షి` వెనక బన్ని- ప్రభాస్ ఇద్దరూ ఉన్నారా? అంటే అవుననే తాజా సమాచారం. అయితే ఆ ఇద్దరూ నిర్మాతలుగా ప్రత్యక్షంగా పెట్టుబడులేమీ పెట్టలేదు కానీ.. వారికి చెందిన కంపెనీలు మహర్షి బిజినెస్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. దిల్ రాజు- పీవీపీ- అశ్వనిదత్ లాంటి దిగ్గజాలు కలిసి నిర్మించిన ఈ సినిమా బిజినెస్ పరంగా గీతా ఆర్ట్స్ తరపున బన్నికి.. యువి క్రియేషన్స్ తరపున ప్రభాస్ కి లింక్ కుదిరిందని చెబుతున్నారు.
మహర్షి సినిమాని కృష్ణాజిల్లా పంపిణీ బాధ్యత దిల్ రాజు-యువి-గీతా సిండికేట్ తీసుకుంది. ఈ మూడు అగ్ర బ్యానర్ల అధినాయకుల మధ్య సింక్ అలా కుదిరింది ఎప్పటినుంచో. వ్యాపారంలో ముగ్గురిదీ సుదీర్ఘమైన అనుభవం.. ముఖ్యంగా పంపిణీ రంగంలో కలిసి పని చేసే సత్సంబంధాలు నెరిపిన అనుబంధం ఉంది. అందుకే మహర్షి లాంటి క్రేజీ సినిమాని ముగ్గురూ కలిసి పంపిణీ చేస్తున్నారట. సమాన వాటాలు వేసుకుని బిజినెస్ చేస్తున్నారని తెలిసింది. అయితే లాభాల్లో కూడా సమానంగానే వాటాలు పంచుకుంటారా? అంటే అవుననే తెలుస్తోంది.
మహర్షి కృష్ణా జిల్లా హక్కులు ఎంత పలికాయి? అంటే.. రూ.6 కోట్ల మేర బిజినెస్ సాగిందట. అంటే తలో రెండు కోట్లు చొప్పున షేర్ చేసుకుంటారన్నమాట. గీతా ఆర్ట్స్ రూ.2 కోట్లు.. యువి సంస్థ 2కోట్లు.. శ్రీవెంకటేశ్వర సంస్థ రూ.2కోట్లు పెడుతున్నాయి. వచ్చిన లాభం సమానంగా పంచుకుంటారు. ఆ విధంగా మహేష్ సినిమా వెనుక బన్నీ, ప్రభాస్ సంస్థలు కూడా పాలు పంచుకున్నట్టే. మరి మహర్షికి బన్ని- ప్రభాస్ అభిమానుల అండదండలు ఉంటాయనే భావించాల్సి ఉంటుంది.