Begin typing your search above and press return to search.

గీత గోవిందం సెన్సార్ అయింది

By:  Tupaki Desk   |   4 Aug 2018 1:54 PM GMT
గీత గోవిందం సెన్సార్ అయింది
X
న‌వ్విస్తారు. కొట్టుకుంటారు. మ‌రింత న‌వ్విస్తారు. ఎవ‌రంటారా? గీత గోవింద్‌ లు. వాళ్ల సంద‌డిని చూసేందుకు మీరు సిద్ధ‌మైపోండ‌ని చిత్ర‌బృందం చెబుతోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ, ర‌ష్మిక మంద‌న జంట‌గా న‌టించిన `గీత గోవిందం` ఈనెల 15న ప్రేక్ష‌కుల ముందుకొస్తున్న విష‌యం తెలిసిందే. శ‌నివారం సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. యు/ఎ స‌ర్టిఫికెట్ వ‌చ్చింది. ఇక ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా విడుద‌ల‌కి రెడీ అని చిత్ర‌బృందం తెలిపింది. సెన్సార్ పూర్త‌యింద‌ని చెబుతూ చిత్ర‌బృందం ఓ పోస్ట‌ర్‌ ని విడుద‌ల చేసింది.

అందులో కూడా సినిమాలో ఉన్న కంటెంట్‌ ని చెప్పేలా డిజైన్ చేశారు. న‌వ్విస్తారు. సీరియ‌స్‌ గా క‌నిపిస్తారు. ఆ త‌ర్వాత ప‌గ‌ల‌బ‌డి న‌వ్విస్తార‌నే సంకేతం వ‌చ్చేలా పోస్ట‌ర్‌ ని డిజైన్ చేసి విడుద‌ల చేశారు. గీత మేడ‌మ్ ప్రేమ‌లో ప‌డిన గోవింద్ అనే పాతికేళ్ల వ‌ర్జిన్ కుర్రాడి క‌థే ఈ చిత్రం. ఇప్ప‌టికే ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌ తో సినిమాకి మంచి బ‌జ్ ఏర్ప‌డింది. ఇక థియేట‌ర్ల‌లో సంద‌డే మిగులుంది. రేప‌ట్నుంచి చిత్ర‌బృందం ప్ర‌మోష‌న్ ప‌రంగా మ‌రింత జోరును పెంచే అవ‌కాశాలున్నాయి.