Begin typing your search above and press return to search.

40.. 50.. 60.. జోరు కొనసాగుతూనే ఉంది

By:  Tupaki Desk   |   11 Sep 2018 8:51 AM GMT
40.. 50.. 60.. జోరు కొనసాగుతూనే ఉంది
X
విజయ్‌ దేవరకొండ - రష్మిక మందన్నా జంటగా పరుశురామ్‌ దర్శకత్వంలో బన్నీ వాసు నిర్మించిన ‘గీత గోవిందం’ చిత్రం ఊహించని వసూళ్లను సాధిస్తోంది. సినిమాకు భారీ ఓపెనింగ్స్‌ రావడంతో లాంగ్‌ రన్‌ లో ఈ చిత్రం 40 కోట్లను వసూళ్లు చేస్తుందని ట్రేడ్‌ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. వరుసగా సెలవలు రావడంతో సినిమాకు కలిసి వచ్చింది. దాంతో 50 కోట్ల మార్క్‌ ను కూడా సునాయాసంగానే చేరుకుంది. 50 కోట్ల వద్ద గోవిందుడి జోరు ఆగుతుందని అంతా భావించారు. కాని ఆ తర్వాత వారాల్లో విడుదలైన చిత్రాలు ఆకట్టుకోవడంలో విఫలం అయ్యాయి. బాక్సాఫీస్‌ వద్ద పోటీ లేకపోవడంతో 50 కోట్ల నుండి 60 కోట్లకు గోవిందుడు చేరుకున్నాడు.

‘గీత గోవిందం’ 25 రోజులు పూర్తి చేసుకోవడంతో, 60 కోట్ల కలక్షన్స్‌ క్లోజ్‌ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాల వారు భావించారు. కాని 25 రోజుల తర్వాత కూడా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుండి కూడా మంచి షేర్‌ వస్తోంది. ఇప్పుడు గోవిందుడి దృష్టి 70 కోట్లపై ఉంది. ఇప్పటికే 67 కోట్ల షేర్‌ ను దక్కించుకున్న ఈ చిత్రం శైలజా రెడ్డి అల్లుడు రాకముందే 69 కోట్లకు చేరే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత మరో కోటిని సునాయాసంగా దక్కించుకుని 70 కోట్ల క్లబ్‌లో చేరుతుందని ట్రేడ్‌ వర్గాల వారు విశ్లేషిస్తున్నారు.

విజయ్‌ దేవరకొండ తన ఫాలోయింగ్‌ తో ఈ స్థాయి వసూళ్లను రాబట్టాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. శైలజా రెడ్డి అల్లుడు ఫలితం కాస్త అటు ఇటు అయితే గోవిందుడి జర్నీ ఇంకా కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయని విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌ అంటున్నారు. 75 కోట్ల వరకు ‘గీత గోవిందం’ చేరుకునే అవకాశాలు లేకపోలేదు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. మరో వారాంతం పూర్తి అయితే గీత గోవిందం చిత్రం ఫైనల్‌ కలెక్షన్స్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.