Begin typing your search above and press return to search.
దేవరకొండ నాన్ బాహుబలి రికార్డ్
By: Tupaki Desk | 1 Sep 2018 4:15 AM GMTఎక్కడికి వెళ్లినా గీతగోవిందం రికార్డులు - సంచలనాల గురించే చర్చ సాగుతోంది. ఇటు తెలుగు రాష్ట్రాలు - అటు ఓవర్సీస్ - చెన్నయ్ - బెంగళూరు ప్రతిచోటా ఈ సినిమా సాధించిన వసూళ్ల గురించి ట్రేడ్ గొప్పగా చెబుతోంది. ఇది రియల్ జెన్యూన్ విజయం. పరిమిత బడ్జెట్ లో తెరకెక్కి 100 కోట్ల గ్రాస్ వసూలు చేసిన సంచలన చిత్రంగా గీతగోవిందం గురించి మార్కెట్ విశ్లేషకులు గొప్పగా చెబుతున్నారు. ఇది మరో సైరాఠ్ తరహా విజయం అనడంలో సందేహమే లేదన్న ముచ్చటా సాగుతోంది.
సక్సెస్‌మీట్ పెట్టినంత మాత్రాన అది సక్సెస్సూ కాదు.. పెట్టకపోయినంత మాత్రాన అది ఫ్లాపూ కాదు! అన్న చందంగా `గీత గోవిందం` కొత్త పాఠం నేర్పింది పరిశ్రమ జనాలకు. ఈ సినిమాతో సమాంతరంగా రిలీజైన ఇతర సినిమాలకు ఇదో పాఠం అయ్యింది. ఇప్పుడు దేవరకొండ మరో అరుదైన రికార్డును అందుకున్నాడు. తమిళనాడులో నాన్ బాహుబలి కేటగిరీలో ఇంతవరకూ ఒక్క మహేష్ తప్ప వేరొక హీరో టచ్ చేయలేని రికార్డుల్ని టచ్ చేశాడు దేవరకొండ. చెన్నయ్ కలుపుకుని తమిళనాడు వ్యాప్తంగా రిలీజైన గీతగోవిందం 5కోట్లు వసూలు చేసింది. ఇది కేవలం తెలుగు వెర్షన్. కనీసం డబ్బింగ్ చేసి కూడా రిలీజ్ చేయలేదు. అయినా ఇంత పెద్ద హిట్టయ్యిందంటే మంచి సినిమాని ఆదరించేందుకు ప్రేక్షక జనం ఎప్పుడూ ముందుంటారని ప్రూవైందిలా. తమిళ యువత ఈ చిత్రాన్ని గొప్పగా ఆదరించారని ప్రముఖ తమిళ క్రిటిక్స్ ప్రశంసించడం చూస్తుంటే తెలుగు సినిమాకి మునుముందు ఇరుగుపొరుగున మంచి రోజులున్నాయని అర్థమవుతోంది.