Begin typing your search above and press return to search.
గోవిందం అమెరికాలో 6కోట్లు
By: Tupaki Desk | 18 Aug 2018 4:28 AM GMTమొత్తానికి బాక్సాఫీస్ వద్ద గోవిందం హవా ఓ రేంజులో కనిపిస్తోంది. విజయ్ దేవరకొండ ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ ని ఖాతాలో వేసుకున్నాడు. ఈ శుక్రవారం థియేటర్లలోకి రిలీజైన గీత గోవిందం ఇంటా బయటా కలెక్షన్ల దుమారం సృష్టిస్తోంది. ఇప్పటికే 25కోట్లు వసూలు చేసి 40 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టేందుకు పయనమవుతోందని సమాచారం.
తాజాగా ఓవర్సీస్ నుంచి 1 మిలియన్ డాలర్ క్లబ్ గురించి సమాచారం అందింది. అమెరికాలో రికార్డ్ స్థాయిలో 128 లొకేషన్లలో రిలీజైన ఈ సినిమా ఈపాటికే ప్రీమియర్లు గురు - శుక్రవారాల్లో అసాధారణ వసూళ్లు సాధించింది. ఓవరాల్ గా 853 అమెరికా డాలర్లు వసూలు చేసింది. అంటే .. ఈ పాటికే మిలియన్ డాలర్ క్లబ్ లో అడుగుపెట్టి ఉంటుందన్నది తాజా రిపోర్ట్.
యూఎస్ లో.. తొలి వారాంతానికి 1.3 మిలియన్ డాలర్లు లేదా 1.4 మిలియన్ డాలర్లు వసూలు చేస్తుందని అంచనాలేర్పడ్డాయి. అంటే 1 మిలియన్ డాలర్ అంటే ఇప్పటికే 6కోట్లు వసూలు చేసినట్టు. బుధవారం 200కె డాలర్లు - గురువారం - 135కె డాలర్లు - శుక్రవారం -120 కె డాలర్లు వసూలు చేసింది. తొలి వారం పూర్తయ్యేప్పటికి కేవలం అమెరికా నుంచే 10కోట్లు సునాయాసంగా వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. 15కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన గీత గోవిందం ఫుల్ రన్ లో డిస్ట్రిబ్యూటర్లకు నాలుగు రెట్ల లాభాలు తేవడం ఖాయంగా అంచనా వేస్తున్నారు. అంటే మొత్తం పెట్టిన పెట్టుబడులు అమెరికా వసూళ్ల నుంచే దక్కుతుంటే - తెలుగు రాష్ట్రాల రిలీజ్ బోనస్ కిందే లెక్క. ఇప్పటికే ఓవరాల్ గా 25కోట్లు వసూలు చేసిందని ఇదివరకూ వార్తలొచ్చాయి. గీతగోవిందం ఓవరాల్ గా 40-50 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని భావిస్తున్నారు.