Begin typing your search above and press return to search.

గీత గోవిందం బ్లాక్ బస్టర్ కాదు!

By:  Tupaki Desk   |   20 Aug 2018 8:31 AM GMT
గీత గోవిందం బ్లాక్ బస్టర్ కాదు!
X
గత బుధవారం భారీ అంచనాల మధ్య విడుదలైన ‘గీత గోవిందం’ ఆ అంచనాల్ని మించిపోయి భారీ విజయాన్నందుకుంది. తొలి రోజే రూ.10 కోట్ల దాకా షేర్ రాబట్టి సంచలనం సృష్టించిన ఈ చిత్రం.. ఆ తర్వాత కూడా అదే దూకుడు కొనసాగించింది. వీక్ డేస్ లో సైతం చాలా స్ట్రాంగ్ గా సాగిపోయింది. ఇక వారాంతం వచ్చేసరికి వసూళ్ల మోత మోగిపోయింది. మెయిన్ సెంటర్లలో దాదాపుగా ఐదు రోజులూ హౌస్ ఫుల్స్ తో నడిచిందీ చిత్రం. ఒక పెద్ద స్టార్ సినిమాకు ఎలా అయితే ఓపెనింగ్స్ ఉంటాయో.. అలాగే దీనికీ వచ్చాయి. ఐదు రోజుల్లోనే రూ.31.65 కోట్ల షేర్ సాధించి అబ్బుర పరిచిందీ చిత్రం. తెలుగు రాష్ట్రాల వరకే షేర్ రూ.21.45 కోట్లు కావడం విశేషం. అమెరికాలో ఈ చిత్రం ఆల్రెడీ 1.5 మిలియన్ డాలర్ల మార్కును అందుకుంది. ఈ చిత్రాన్ని కేవలం బ్లాక్ బస్టర్ అని సరిపెట్టలేం. డబుల్ బ్లాక్ బస్టర్ అనాల్సిందే. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.45-50 కోట్ల మధ్య షేర్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఏరియాల వారీగా తొలి వారాంతంలో ‘గీత గోవిందం’ వరల్డ్ వైడ్ షేర్ల వివరాలు..

నైజాం- రూ.8.7 కోట్లు
సీడెడ్- రూ.3.35 కోట్లు
వైజాగ్- రూ.2.18 కోట్లు
తూర్పు గోదావరి- రూ.1.75 కోట్లు
పశ్చిమ గోదావరి- రూ.1.39 కోట్లు
కృష్ణా- రూ.1.66 కోట్లు
గుంటూరు- రూ.1.74 కోట్లు
నెల్లూరు- రూ.68 లక్షలు
ఏపీ-తెలంగాణ షేర్- రూ.21.45 కోట్లు
కర్ణాటక- రూ. 2.30 కోట్లు
తమిళనాడు- రూ.60 లక్షలు
రెస్టాఫ్ ఇండియా- రూ.30 లక్షలు
యుఎస్- రూ.5.95 కోట్లు
రెస్టాఫ్ వరల్డ్- రూ.1.05 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్- రూ.31.65 కోట్లు