Begin typing your search above and press return to search.

వారికి గీత సీరియస్‌ వార్నింగ్‌

By:  Tupaki Desk   |   15 Oct 2018 11:20 AM GMT
వారికి గీత సీరియస్‌ వార్నింగ్‌
X
తెలుగు సింగర్‌ గా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ ను సొంతం చేసుకున్న గీతా మాధురి ఐటెం సాంగ్స్‌ స్పెషలిస్ట్‌ గా మంచి గుర్తింపు దక్కించుకున్న విషయం తెల్సిందే. ఆమె రియాల్టీ షోలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చింది. తాజాగా గీతా మాధురి తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 లో పాల్గొని రన్నరప్‌ గా నిలిచిన విషయం తెల్సిందే. కౌశల్‌ కు గట్టి పోటీ ఇచ్చిన గీతా మాధురి సోషల్‌ మీడియాలో తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్న విషయం తెల్సిందే. ఇన్నాళ్లు తాము అనుకున్న గీతామాధురి బిగ్‌ బాస్‌ హౌస్‌ లో మరోలా కనిపిస్తుందని ఆమె అభిమానులు కొందరు సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేసిన విషయం తెల్సిందే.

బిగ్‌ బాస్‌ లో ఆమె ప్రవర్తించిన, వ్యవహరించిన తీరును తప్పుబడుతూ కొందరు సోషల్‌ మీడియాలో మరీ ముఖ్యంగా యూట్యూబ్‌ లో ఇష్టం వచ్చినట్లుగా ఆమెపై కథనాలు అల్లేశారు. గీతా మాధురి ఆ వ్యక్తితో ఇలా, ఆమె ప్రవర్తన ఇలా అంటూ యూట్యూబ్‌ లో పెద్ద ఎత్తున వీడియోలు పబ్లిష్‌ అయ్యాయి. దాంతో ఆమె చాలా సీరియస్‌ అయ్యింది. తనను కించపర్చే విధంగా ఉన్న వీడియోలను వెంటనే తొలగించాలంది. తనను కించపర్చే విధంగా వీడియోు పోస్ట్‌ చేసిన యూట్యూబ్‌ ఛానెల్స్‌ పై లీగల్‌ యాక్షన్‌ కు సిద్ద పడుతున్నట్లుగా సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది.

లీగల్‌ చర్యలకు ముందు రెండు రోజులు వారికి ఛాన్స్‌ ఇచ్చింది. ఈ రెండు రోజుల్లో తన గురించి తప్పుగా ఉన్న వీడియోలన్ని తీసేయాలని, ఆ తర్వాత కూడా ఇలాగే కొనసాగితే మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరించింది. గీతా మాధురి హెచ్చరిక నేపథ్యంలో సదరు యూట్యూబ్‌ ఛానెల్స్‌ వారు ఆ వీడియోలను డిలీట్‌ చేస్తారా, లేదంటే గీతా మాధురితో న్యాయపోరాటంకు సిద్దం అవుతారో చూడాలి. యూట్యూబ్‌ లో ఉన్న ఆ వీడియోలు ఆమె పరువు తీసేలా ఉన్నాయి. ఆమె ఇమేజ్‌ ను మొత్తం డ్యామేజ్‌ చేసేవిగా ఉన్నాయంటూ ఫ్యాన్స్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.