Begin typing your search above and press return to search.

'అహింస' హీరోయిన్ ని తేజ ఎంపీ అడ‌వుల్లో ప‌రుగులెట్టించాడా?

By:  Tupaki Desk   |   25 May 2023 10:00 PM GMT
అహింస హీరోయిన్ ని తేజ ఎంపీ అడ‌వుల్లో ప‌రుగులెట్టించాడా?
X
ద‌ర్శ‌కుడు తేజ ప్రేమ మ‌కావ్యాలు ఎలా ఉంటాయో చెప్పాల్సిన ప‌నిలేదు. 'చిత్రం'...'నువ్వు'... 'జ‌యం'..'జై' ..'కేక‌'..'నీకు నాకు డ్యాష్ డ్యాష్' లాంటి సినిమాలతో కొన్నాళ్ల పాటు ఓ ట్రెండ్ సృష్టించాడు. వీటిలో ప్రేమ కోసం హీరోతో పాటు హీరోయిన్లు ఎలా పాట్లు ప‌డుతారో ?త‌న‌దైన శైలిలో ఆవిష్క‌రించారు. ప్రేమ‌ను కాపాడు కాపాడు కోవ‌డం కోసం కుటుంబాల్ని.. విల‌న్ల‌ని ఎదురించి ఎలా ముందుకెళ్లారు? అన్న‌ది అంతే ఆస‌క్తిక‌రంగా మాలిచారు.

ఆ జానర్ చిత్రాల‌తో మార్కెట్ లో బ్రాండ్ గాను వెలిగాడు. ఆ త‌ర్వాత అదే త‌ర‌హాలో సినిమాలు బోర్ కొట్టాయి. దీంతో 'నేనే రాజు నేనే మంత్రి'..'సీత' లాంటి సినిమాల‌తో ట్రెండ్ మార్చినట్లు క‌నిపించింది. అలాగ‌ని తేజ మార్క్ ల‌వ్ స్టోరీలు వ‌దల్లేదు. తాజాగా రామానాయుడు ముద్దుల మ‌న‌వ‌డు అభిరాం ని ప‌రిచ‌యం చేస్తూ 'అహింస' సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమాతో గీతికా తివారీ అనే కొత్త అమ్మాయి హీరోయిన్ గా ప‌రిచ‌యమ‌వుతుంది. తాజాగా ఈ సినిమాలో త‌న పాత్ర గురించి గితికా రివీల్ చేసింది. 'సంస్కృతి..ప్ర‌కృతి..కుటుంబంతో ముడిప‌డిన క‌థ ఇది. ఇందులో అహ‌ల్య నా పాత్ర పేరు.

అమాయ‌కంగా క‌నిపిస్తా. శ‌క్తివంత‌మైన యువ‌తిగా ఎదిగే తీరు ఆక‌ట్టుకుంటుంది. ఆ పాత్ర గురించి తేజ చెబుతున్న‌ప్పుడు ల‌వ్ లో ప‌డిపోయా. ప్రేమ‌పై న‌మ్మ‌క‌మున్న అహ‌ల్య‌ప‌డే క‌ష్టాలు. ఆమెకి ఎదుర‌య్యే స‌వాళ్లు సినిమాలో కీల‌కం.

తేజ స‌ర్ త‌న‌దైన శైలిలో రూపొందించారు. 90 శాతం మ‌ధ్య‌ప్ర‌దేశ్ అడవుల్లోనే షూటింగ్ చేసాం. ద‌ట్ట‌మైన అడ‌వుల్లో షూటింగ్ ఇబ్బంది గా అనిపించినా త‌ప్ప‌లేదు. స‌న్నివేశాల‌కు ఆలో కేష‌న్లు డిమాండ్ చేయ‌డం తో క‌ష్టం అయినా భ‌రించాం. అదొక మంచి అనుభ‌వం. క‌ష్ట‌ప‌డిన‌ప్పుడే దాని విలువ తెలుస్తుంది.

తొలి సినిమాతోనే న‌టుల‌కు ఎదుర‌య్యే స‌వాళ్ల‌ని ఎదుర‌య్యాయి. ఇక నా నేటివ్ ప్లేస్ కూడా ఎంపీనే. అక్క‌డే పుట్టి పెరిగా. డిగ్రీ త‌ర్వాత గ్లామ‌ర్ ప్ర‌పంచంలోకి వ‌చ్చేసా. మొద‌ట కొన్ని యాడ్స్ చేసాను' అని అంది.