Begin typing your search above and press return to search.

ఆ మోడ‌ల్ వ్యాఖ్య‌లు...ప‌రువు న‌ష్టం దావా!

By:  Tupaki Desk   |   5 Nov 2017 9:31 AM GMT
ఆ మోడ‌ల్ వ్యాఖ్య‌లు...ప‌రువు న‌ష్టం దావా!
X
హిందీ బిగ్‌బాస్‌ రియాలిటీ షో 11వ సీజన్ వివాదాల‌తో ర‌స‌వ‌త్త‌రంగా మారిన సంగ‌తి తెలిసిందే. బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌ ఆర్షి ఖాన్‌పై నటి, మోడల్‌ గెహానా వశిష్ఠ్‌ మరో మోడల్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆర్షి ఖాన్ త‌న వయసు, విద్యార్హతలు, పాకిస్తాన్ క్రికెటర్‌ షాహిద్‌ ఆఫ్రిదితో ప‌డ‌క‌గ‌ది పంచుకున్న విష‌యాలతో స‌హా ఆమె చెప్పినవన్నీ అబద్ధాలని ఓ వార్తా చానెల్ ఇంట‌ర్వ్యూలో చెప్పింది. ఆర్షి ఖాన్‌పై 10 క్రిమినల్‌ కేసులున్నాయ‌ని, భారత్‌, పాకిస్తాన్‌ జెండాలను అవమానించిన కేసులు కూడా ఇందులో ఉన్నాయని, ఆమె 50 ఏళ్ల వ్యక్తిని పెళ్లి చేసుకుందని చెప్పి సంచ‌ల‌నం రేపింది. తాను చెప్పిన విష‌యాల‌న్నిటికీ ఆధారాలున్నాయ‌ని కూడా చెప్పి అర్షి ఖాన్ కు షాకిచ్చింది. అయితే, ఈ వ్యాఖ్య‌లు గెహానాకు బోలెడు ప‌బ్లిసిటీని తెచ్చిపెట్టాయి. కానీ, ఆ వ్యాఖ్య‌ల‌తో ఆమెకు తిప్ప‌లు త‌ప్పేలా లేవు.

ఆ వ్యాఖ్య‌లు త‌న ప‌రువుకు భంగం క‌లిగించేలా ఉన్నాయ‌ని పేర్కొంటూ గెహానాపై అర్షి ఖాన్ ప‌రువున‌ష్టం దావా వేసింది. త‌న‌పై చేసిన ఆరోప‌ణ‌ల‌కు స్పందింస్తూ గెహానాపై ఆర్షి ఖాన్‌ కోటి రూపాయల పరువు నష్టం దావా వేసింది. ఆర్షి వ్యక్తిగత ప్రచారకుడు ఫ్లైన్న్‌ రెమెడివోస్ ....ఈ విష‌యాన్ని మీడియాకు తెలిపాడు. పలు మీడియా ఛానెళ్ల ఇంటర్వ్యూల‌లో గెహానా చేసిన వ్యాఖ్యలు అర్షి ఖాన్‌ వ్యక్తిగత జీవితానికి సంబంధించినవిగా ఉన్నాయ‌ని చెప్పాడు. బిగ్‌ బాస్ లో కంటెస్టంట్ అయిన అర్షిని దేశం మొత్తం చూస్తోంద‌ని, గెహానా వ్యాఖ్యలు ఆర్షి ఖాన్ జీవితంపై ప్రభావం చూపనుండ‌డంతోనే కేసు వేయించామ‌ని తెలిపాడు.