Begin typing your search above and press return to search.

వేడెక్కించ‌డంలో గురువునే ఫాలో అవ్వాలా?

By:  Tupaki Desk   |   17 Feb 2022 4:02 PM GMT
వేడెక్కించ‌డంలో గురువునే ఫాలో అవ్వాలా?
X
వెట‌ర‌న్ స్టార్స్ ని అనుక‌రించ‌డం.. త‌మ ఫేవ‌రెట్ స్టార్ల‌ను ఇమ్మిటేట్ చేయ‌డం రెగ్యుల‌ర్ గా న‌వ‌త‌రం తార‌ల్లో చూసేదే. న‌ట‌న స‌హా ప్ర‌చార హంగామా .. ఫ్యాష‌న్ అండ్ స్టైలింగ్.. మేక‌ప్ .. ఎంచుకునే దుస్తులు వ‌గైరా వైగైరా వ్య‌వ‌హారాల్లో సీనియ‌ర్ల‌ను జూనియ‌ర్లు ఫాలో అవుతుంటారు.

కానీ ఈ అమ్మ‌డు మాత్రం ఏకంగా ఫోటోషూట్ల‌ను కూడా కాపీ కొట్టేస్తోంది. అంతేనా త‌న‌కు గురువు గా భావించే దీపిక‌ను అన్ని విధాలుగా కాపీ కొట్టేస్తోంది. ఇప్పుడు అండ‌ర్ వాట‌ర్ ఫోటోషూట్ విష‌యంలోనూ దీపిక‌నే ఫాలో అవుతూ అభిమానుల్లో చ‌ర్చ‌కు తావిచ్చింది.

తాజా వెబ్ సినిమా గెహ్ర‌యాన్ ప్ర‌మోష‌న్స్ కోసం అన‌న్య‌ ఎంచుకున్న దుస్తులు స‌హా ప్ర‌తిదీ త‌న గురువు దీపిక నుంచి స్ఫూర్తి పొందిన‌వే. త‌న‌తో పోటీ ప‌డుతూ వేడెక్కించాల‌ని ప్ర‌య‌త్నించి త‌డ‌బ‌డింది. గురువును బీట్ చేయ‌డంలో నెగ్గుకు రాలేక‌పోయింది. ప్ర‌తిసారీ దీపిక‌నే హైలైట్ అయ్యింది. వేడి పెంచే లిప్ లాక్ లు డ్రెస్సుల్లోనూ త‌న కాలిగోటికి నేటిత‌రం స‌రిపోద‌ని ప్రూవ్ చేసింది డిప్స్.

అనన్య పాండే- దీపికా పదుకొణె.. సిద్ధాంత్ చతుర్వేది.. ధరియా కర్వా నటించిన గెహ్రైయాన్ ఇటీవలే OTT లోకి వచ్చింది. శకున్ బాత్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై మిశ్ర‌మ స్పంద‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి.

తిట్టేవాళ్లు ఉన్నా న‌టీమ‌ణుల ప్ర‌ద‌ర్శ‌న‌ను పొగిడేవాళ్లే ఎక్కువ‌. బోల్డ్ కంటెంట్ లో జీవించింది దీపిక‌. త‌న‌తో పోటీప‌డి న‌టించింది అన‌న్య అంటూ పొగిడేశారు. ఆర్టిస్టుల ప‌రంగా అభిమానులు విమర్శకుల నుండి మంచి సమీక్షలు ద‌క్కాయి. ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ  మొబైల్ ఫోన్ లకు అతుక్కునేలా చేసింది.

గెహ్రైయాన్ విడుదల తర్వాత అన‌న్య రేంజు పెరిగింది. నటిగా అద్భుతమైన ప‌రిణ‌తిని ఎదుగుదలని చూపించింది. త‌న న‌ట‌న‌ అన్ని వర్గాల నుండి ప్రశంసలు అందుకోవడం ఆశ్చర్యకరమైన అంశం. నసీరుద్దీన్ షా- దీపికా పదుకొణె-రజత్ కపూర్ వంటి అనుభవజ్ఞుల నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంది.

పరిశ్రమ అగ్ర మీడియా విమర్శకుల నుండి ప్రశంసలు అందుకున్న తరువాత నెటిజనులు అనన్య పాండే తన అద్భుతమైన నటనను మెచ్చుకోవడంలో వెనుకంజ వేయలేదు.

 పాండేను `తియా` అంటూ నెటిజన్లు పొగిడేస్తూ అభివర్ణించడం సినిమా విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. #అనన్యపాండే మీరు ప్రవర్తించే విధానంలో మీరు చాలా వాస్తవికంగా నిజాయితీగా ఉన్నారని నేను భావిస్తున్నాను. అంతగా ఆకట్టుకుంది. @అనన్యపాండేయ్ #గెహ్రైయాన్ అంటూ పొగిడేశారు.