Begin typing your search above and press return to search.

ఫొటో స్టోరీ: తల్లయ్యాక ఇంత హాట్‌గానా..

By:  Tupaki Desk   |   9 Jun 2015 11:30 AM GMT
ఫొటో స్టోరీ: తల్లయ్యాక ఇంత హాట్‌గానా..
X
బాలీవుడ్‌ నుంచి చాలామంది అమ్మాయిలు టాలీవుడ్‌కు వచ్చారు. కానీ మిగతా వాళ్లెవ్వరూ వేయనంత బలమైన ముద్ర వేసింది జెనీలియా. బొమ్మరిల్లు సినిమా తర్వాత ఆమె ముంబయి అమ్మాయి అన్న విషయమే మరిచిపోయారు జనాలు. హాసినిగా అంతగా మన గుండెల్లోకి దూరిపోయింది జెన్నీ. చాలావరకు సినిమాల్లో పద్ధతిగా కనిపించిన జెన్నీ.. అప్పుడప్పుడూ మాత్రమే కొంచెం హాట్‌నెస్‌ రుచి చూపించింది. ఏడెనిమిదేళ్ల పాటు తెలుగులో హవా సాగించిన జెన్నీ.. ఓ దశలో మళ్లీ బాలీవుడ్‌కు వెళ్లిపోయింది. ఒకటి రెండు సినిమాలు చేశాక... తన ప్రియుడు రితీశ్‌ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడేసింది.

ఇద్దరికీ గత ఏడాది బాబు కూడా పుట్టాడు. అబ్బాయి పుట్టాక బయటెక్కడా కనిపించని జెన్నీ.. సడెన్‌గా ఐఫా అవార్డుల్లో తళుక్కున మెరిసింది. అక్కడామెను చూసిన వాళ్లంతా షాక్‌! ఎందుకంటే తల్లయ్యాక ఎవరైనా ఒళ్లు చేసి అదోలా తయారవుతారు కానీ.. జెన్నీ మాత్రం మునుపటి కంటే అందంగా, హాట్‌గా మారింది. జెన్నీ వచ్చినా పద్ధతిగా వస్తుందనుకున్నారు కానీ.. ఇంత హాట్‌గా తయారై వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. దీంతో ఐఫా అవార్డుల కార్యక్రమాలకు లేటెస్ట్‌ బ్యూటీస్‌ ఎందరు వచ్చినా.. అందరికళ్లూ జెన్నీ మీదే నిలిచాయి.