Begin typing your search above and press return to search.

అబ్బా.. ఎంత క్యూట్‌గా ఉందో..

By:  Tupaki Desk   |   13 July 2015 11:44 PM GMT
అబ్బా.. ఎంత క్యూట్‌గా ఉందో..
X
ఆ కళ్లు నీలాలు. ఆకల్లు పుట్టించే గాలాలు. ఆ చూపులు చురకత్తులు. మతిచెడే వైనాలు. ఇలా ఉన్నట్టుండి ఏ కుర్రాడైనా కాళిదాసు అయిపోడూ? అంతటి పవర్‌ ఆ చూపులకు లేదూ? జెలో(జెన్నిఫర్‌ లోపేజ్‌)ని మించినదేదో జెనీలియాలో ఉంది. అందుకే తెలుగు, తమిళ్‌, హిందీ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కుర్రతనంలోని చిలిపితనం, చిలిపితనంలోని అల్లరితనం ఈ అమ్మడికే చెల్లు. హీరోగారికి భార్య. ఓ బిడ్డకు తల్లి అయినా ఇప్పటికీ జెనీలియాలోని షార్ప్‌నెస్‌ తగ్గనేలేదు. ఇటీవలే ఓ పబ్లిక్‌ వేడుకలో తళుక్కుమందిలా.

కళ్లకు కాటుక, అందమైన నవ్వు.. ఆహార్యానికి తగ్గట్టే కాంబినేషన్‌ డిజైనర్‌ వేర్‌, డిజైనర్‌ డ్రెస్‌కి తగ్గట్టే చెవి జూకాలు.. ఇవన్నీ మెయింటెయిన్‌ చేస్తుంది కాబట్టే ఇప్టటికీ పదిమందిలో తనకంటూ ఓ ప్రత్కేకతను నిలబెట్టుకుంటోంది. జెన్నీలోని ఈ లుక్‌ చూస్తుంటే టాలీవుడ్‌లో మరోసారి కథానాయిక అయినా అవ్వొచ్చనిపిస్తోంది. ఐశ్వర్యారాయ్‌ లా బాలీవుడ్‌లో రీఎంట్రీ ఇచ్చి తనదైన క్యూట్‌ అప్పియరెన్స్‌తో మనసులు దోచుకోవడం ఖాయం అనిపిస్తోంది. టాలీవుడ్‌ దర్శకనిర్మాతలకు ఓ ఆప్షన్‌ ఇస్తుందేమో చూడాలి.