Begin typing your search above and press return to search.
17 ఏళ్ల ప్రేమను ఇలా సెలబ్రేట్ చేశారు
By: Tupaki Desk | 3 Jan 2020 5:30 PM GMTబాలీవుడ్ తో పాటు కోలీవుడ్ మరియు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ జెనీలియా బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. వీరిద్దరికి మొదటి సినిమా ఒకటే. అదే 'తుజే మేరీ కసమ్'. 2003లో విడుదలైన తుజే మేరీ కసమ్ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో పాటు జెనీలియా మరియు రితేష్ దేశ్ ముఖ్ కు స్టార్ డంను తెచ్చి పెట్టింది. ఆ చిత్రం తర్వాత ఇద్దరి కెరీర్ ఒక్కసారిగా పీక్స్ కు చేరింది.
తుజే మేరీ కసమ్ చిత్రం సమయంలోనే అంటే 2003 లోనే వీరిద్దరి మద్య ప్రేమ మొదలైంది. అప్పట్లోనే వీరు పెద్దలకు చెప్పినా కూడా చిన్న వయసు అవ్వడం వల్ల పెళ్లికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత కూడా వీరిద్దరు ప్రేమలోనే ఉన్నారు. దాదాపు పుష్కరకాలం పాటు అంటే 12 ఏళ్ల తర్వాత వీరి ప్రేమను పెళ్లిగా మల్చుకున్నారు. ప్రస్తుతం వీరికి ఇద్దరు కొడుకులు. రితేష్ దేశ్ ముఖ్ హీరోగా సినిమాలు చేస్తుంటే జెనీలియా కూడా మళ్లీ వెండి తెరపై రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యింది.
వీరిద్దరి మొదటి సినిమా తుజే మేరీ కసమ్ చిత్రం విడుదలై 17 ఏళ్లు అవ్వడంతో పాటు వీరి ప్రేమకు 17 ఏళ్లు నిండటంతో ఆ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. ఆ సినిమాలోని రెండు పాటలకు స్టెప్పులు వేసి మరీ తమ ఆనందాన్ని పంచుకున్నారు. రితేష్ జెనీలియాతో వేసిన డాన్స్ వీడియోలను ఇన్ స్టా లో పోస్ట్ చేశాడు.
ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరిద్దరు ఇలాగే కలకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం అంటూ అభిమానులు ఈ వీడియోలకు కామెంట్స్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఏమాత్రం అందం తగ్గని జెనీలియా మళ్లీ సినిమాల్లో నటించాలని కూడా ఫ్యాన్స్ కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.