Begin typing your search above and press return to search.

వల్గర్ ఆంటీ కామెంట్స్ కు జెన్సీ రియాక్షన్‌

By:  Tupaki Desk   |   29 Sep 2021 11:30 PM GMT
వల్గర్ ఆంటీ కామెంట్స్ కు జెన్సీ రియాక్షన్‌
X
సోషల్‌ మీడియాలో సెలబ్రెటీలను ట్రోల్‌ చేయడం అనేది చాలా సాదారణ విషయం. కొన్ని ట్రోల్స్ శృతి మించుతూ ఉంటాయి. కొందరు హద్దలు మీరు ట్రోల్స్ చేయడం.. కామెంట్స్ చేయడం చేసిన సమయంలో సెలబ్రెటీలు వారి ట్రోల్స్ కు కాస్త ఘాటుగానే స్పందిస్తారు. జెనిలియాను ఒక నెటిజన్ వల్గర్ ఆంటీ అంటూ కామెంట్‌ చేశాడు. జెనీలియా గురించి అతడి కామెంట్‌ తాజాగా ఒక టాక్ షో లో ప్రస్థావనకు వచ్చింది. ఆ ట్రోల్స్ చేసిన వ్యక్తికి చాలా సీరియస్ గానే జెనీలియా సమాధానం ఇచ్చింది. సోషల్ మీడియాలో బ్యాడ్‌ కామెంట్స్ కు జెనీలియా పెద్దగా రెస్పాండ్ అవ్వదు. కాని ఈసారి మాత్రం జెనీలియా చేసిన వ్యాఖ్యలు కాస్త చర్చనీయాంశం అయ్యాయి. జెనీలియాలో మరో యాంగిల్‌ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

జెనీలియా మరియు రితేష్‌ దేశ్‌ ముఖ్‌ లు కలిసి నటుడు అర్బాజ్ ఖాన్‌ హోస్ట్‌ చేస్తున్న పించ్ టాక్ షో లో పాల్గొన్నారు. ఈ షో లో చాలా ఇంట్రెస్టింగ్‌ విషయాలను సెలబ్రెటీలతో మాట్లాడించడం.. చర్చించడం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో సెలబ్రెటీల గురించి వచ్చే ట్రోల్స్ మరియు కామెంట్స్ ను కూడా ఈ షో లో అర్బాజ్‌ ఖాన్‌ చర్చించడం జరుగుతుంది. ఎప్పడు స్పందించని విషయాలకు కూడా సెలబ్రెటీలు అర్బాజ్‌ ఖాన్‌ షో లో స్పందిస్తారు. తాజాగా జెనీలియా మరియు రితేష్‌ లు కలిసి వెళ్లిన ఎపిసోడ్‌ లో పలు ఆసక్తికర విషయాలను ఆయన అడిగినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా ఒక ఈవెంట్ లో భాగంగా రితేష్‌ దేశ్‌ ముఖ్‌ హీరోయిన్‌ ప్రీతి జింటా చేతులను ముద్దాడాడు. జెనీలియా అక్కడే ఉండి.. చాలా సీరియస్ గా చూస్తూ ఉంది. అప్పట్లో ఈ వీడియో చాలా వైరల్‌ అయ్యింది.

ఆ వీడియోను కొనసాగిస్తూ కొందరు ఆ తర్వాత ఇద్దరికి గొడవ అయ్యింది.. రితేష్‌ ను ఇంటికి వెళ్లిన తర్వాత జెనీలియా కొట్టింది అంటూ ఒక వీడియోను కూడా అర్బాజ్ ఖాన్‌ చూపించాడు. ఆ వీడియోకు ఒక నెటిజన్‌ స్పందిస్తూ.. సిగ్గు లేదా వల్గర్ ఆంటీ.. ఎప్పుడు ఓవర్‌ యాక్టింగ్‌ చేస్తూ ఉంటావు. అది నీ మొహానికి అస్సలు సూట్‌ అవ్వదు అంటూ కామెంట్స్ పెట్టాడు. సోషల్‌ మీడియాలో వచ్చిన కామెంట్స్ కు జెనీలియా ఈ షో ద్వారా స్పందిస్తూ.. ఎవరైతే ఈ కామెంట్ చేశాడు పాపం అతడి ఇంట్లో పరిస్థితులు బాగున్నట్లుగా లేవు. అందుకే ఇలా మాట్లాడుతున్నాడు. భాయ్‌ జాన్ మీ ఇంట్లో అంతా బాగున్నారని నేను ఆశిస్తున్నాను అంటూ అతడి గూబ పగిలి పోయింతగా కౌంటర్ ఇచ్చింది. సోషల్‌ మీడియాలో ఇలాంటి కామెంట్స్ కామన్‌.. పట్టించుకోనక్కర్లేదు అంటూ రితేష్‌ దేశ్‌ ముఖ్య అన్నాడు.