Begin typing your search above and press return to search.
బిరియానీ బిజినెస్ లో అగ్ర కథానాయిక జోరు
By: Tupaki Desk | 17 Sept 2021 1:00 PM ISTస్టార్ డమ్ ని ఎంజాయ్ చేసి ఆ తరువాత వారి కెరీర్ ఇక అయిపోయింది అని అనుకున్న స్టార్ హీరోలు హీరోయిన్లు ఏదో ఒక వ్యాపారంలో పెట్టుబడి పెడుతున్నారు. ఆయా రంగాల్లోనూ తమదైన మార్కుని ప్రదర్శిస్తూ ప్రత్యేతని చాటుకుంటున్నారు. టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్లుగా పేరు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్- తమన్నా వంటివారు ఆభరణాల వ్యాపారంలో పెట్టుబడి పెట్టారు. ఆ తరువాత విఫలమయ్యారు. ఇలియానా సొంత డిజైనర్ డ్రస్ ఔట్ లెట్ ని ప్రారంభించి ఆకట్టుకోలేకపోయింది. రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్‌నెస్ సెంటర్ లని ప్రారంభించి రాణిస్తోంది.
సమంత దుస్తుల వ్యాపార రంగంలోకి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా సాకీ పేరుతో కొత్త బ్రాండ్ ని పరిచయం చేసి తన ప్రత్యేతని చాటుకుంటోంది. అలాగే ప్రత్యూష ఫౌండేషన్ పేరుతో చిన్న పిల్లలకు అండగా నిలుస్తోంది. ఇదే బాటలో హీరోయిన్ జెనీలియా ఎట్టకేలకు తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించింది సాధారణంగా ఫ్యాషన్ వ్యాపారంలోకి ప్రవేశించే ఇతర హీరోయిన్ల తరహాలో కాకుండా జెనీలియా కాస్త భిన్నమైన రంగాన్ని ఎంచుకుంది. ఆమె ఆహార ఉత్పత్తిని ఎంచుకుంది. భారీ ట్విస్ట్ ఏమిటంటే,.. జెనీలియా ఆమె భర్త రితేష్ దేష్‌ముఖ్ ఇప్పుడు ఆన్ లైన్ డెలివరీల ద్వారా ముంబైలో మొక్కల ఆధారిత మాంసం ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. `ఇమాజిన్ మీట్స్` అనేది జెనీలియా, రితేష్ దేశ్ ముఖ్ సృష్టించిన బ్రాండ్. ఇదే తరహా బిజినెస్ ని షారుఖ్ ఖాన్ కూడా ప్రారంభించారు.
జెనీలియా అండ్ కో ఈ ఆహార ఉత్పత్తిని ముంబై నగరంలో విక్రయిస్తోంది. వీరి బ్రాండ్ కి ఖీమా బిర్యానీకి చాలా మంది ఫిదా అయిపోతున్నారు. ఉదాహరణకు మటన్ ఖీమా బిర్యానీ ఎలా వుంటుందో అంతే సహజమైన అనుభూతిని టేస్ట్ ని మొక్కల ద్వారా ఉత్పత్తి చేస్తున్న జెనీలియా బిర్యానీలోనూ వుంటోంది. దీంతో ముంబై జనం ఈ బిర్యానీని ఎగబడి తింటున్నారు. దీంతో శాకాహారులు కూడా ఇప్పుడు మాంసాన్ని తినకుండానే ఈ ఖీమా బిర్యానీని ఆస్వాదిస్తున్నారు. దీంతో జెనీలియా ఖీమా బిర్యానీకి ముంబైలో మాంచి డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతానికి ఈ ఆన్ లైన్ వ్యాపారం ముంబైకి మాత్రమే పరిమితం అయింది. అతి త్వరలో ఈ సెలబ్రిటీ జంట యావత్ భారతదేశం మొత్తానికి ఈ వ్యాపారాన్ని విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. ఇప్పటివరకు `ఇమాజిన్ మీట్స్` అందించే వివిధ బిర్యానీలపై ఫీడ్ బ్యాక్ సానుకూలంగా ఉంది.
15ఏళ్లుగా హాసినిని మరువనేలేదు!
సిద్ధార్థ్ - జెనీలియా జంటగా నటించిన క్లాసిక్ హిట్ మూవీ `బొమ్మరిల్లు` 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి భాస్కర్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. 20 ఆగస్టు 2006 న విడుదలైన ఈ సినిమా మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. యువతరం సకుటుంబ సమేతంగా చూడదగ్గ గొప్ప చిత్రంగా మనసుల్ని గెలుచుకుంది. ఈ సినిమాతోనే భాస్కర్ కాస్తా బొమ్మరిల్లు భాస్కర్ అయ్యాడు. అంతగా అతడికి పాపులారిటీ దక్కింది. అలాగే జెనీలియాకు తెలుగు లోగిళ్లలో అల్లరి హాసినిగా గొప్ప ప్రేమ ఆదరాభిమానాలు దక్కాయి. సిద్ధార్థ్ అద్బుత నటనకు బొమ్మరిల్లు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచింది. `బొమ్మరిల్లు` విడుదలై 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.
రితీష్ దేశ్ ముఖ్ తో వివాహం తర్వాత జెనీలియా ముంబై వెళ్లినప్పటి నుండి నటనలో అంత చురుకుగా లేరు. జెనీలియా చివరిగా 2012 చిత్రం `నా ఇష్టం` లో కనిపించింది. రానా దగ్గుబాటి సరసన నాయికగా నటించింది. సిద్ధార్థ్ కొన్నాళ్ల తర్వాత శర్వానంద్ తో కలిసి ద్విభాషా చిత్రం మహా సముద్రంతో టాలీవుడ్ లోకి పునరాగమనం చేస్తున్నాడు.