Begin typing your search above and press return to search.
జెనీలియా ఆలోచన అది కాదండీ బాబూ!
By: Tupaki Desk | 10 Sep 2015 1:31 PM GMTజెనీలియా డిసౌజా.. తెలుగు ప్రేక్షకులు అంత ఈజీగా మరిచిపోయే పేరు కాదిది. ‘బొమ్మరిల్లు’ సినిమాతో ఆమె వేసిన ముద్ర అలాంటిలాంటిది కాదు. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ తనదైన ముద్ర వేసి ముంబయి వెళ్లిపోయిన జెన్నీ.. తన దీర్ఘ కాల ప్రేమికుడు రితీశ్ ముఖ్ ను పెళ్లాడి లైఫ్ లో సెటిలైపోయింది. ఈ మధ్య ఓ బాబుకు కూడా జన్మనిచ్చింది. ఐతే ఇప్పుడు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ నుంచి కొంచెం విరామం తీసుకుని కుటుంబానికి ఆర్థిక తోడ్పాటు అందించేందుకు రెడీ అవుతోంది జెనీలియా. త్వరలోనే ఆమె నిర్మాత అవతారం ఎత్తబోతోంది. తొలి ప్రయత్నంగా ఓ తమిళ హిట్ మూవీని రీమేక్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటోంది. ఆ సినిమా మరేదో కాదు.. జయం రవి హీరోగా నటించిన తనీ ఒరువన్.
తనీ ఒరువన్ సినిమా రీమేక్ రైట్స్ కోసం జెన్నీ ప్రయత్నిస్తోందనగానే బాలీవుడ్ లో రకరకాలుగా మాట్లాడుకున్నారు. ఈ సినిమాను రితీశ్ కథానాయకుడిగా రీమేక్ చేయాలనుకుంటోందని.. అయినా అలాంటి పవర్ ఫుల్ రోల్ కు రితీశ్ ఎక్కడ సరిపోతాడని అనుకున్నారు. ఐతే జెన్నీ రీమేక్ చేయాలనుకుంటోంది హిందీలో కాదు.. మరాఠీలో. హిందీలో ఈ సినిమా మీద సల్మాన్ ఖాన్ కర్చీఫ్ వేసిన సంగతి తెలిసిందే. మరాఠీ నుంచి కూడా పోటీ ఉన్నప్పటికీ జెన్నీకే రీమేక్ రైట్స్ దక్కే అవకాశాలున్నాయి. ఆమె ఇంతకుముందు జయం రవితో కలిసి బొమ్మరిల్లు రీమేక్ లో నటించింది. దానికి రాజానే దర్శకుడు. కాబట్టి హీరో, దర్శకుడితో ఉన్న పరిచయం కొద్దీ కొంచెం తక్కువకే రీమేక్ రైట్స్ పట్టేయాలని చూస్తోంది జెన్నీ. నిర్మాతగా తొలి ప్రయత్నంలో ఓ సేఫ్ వెంచర్ కోసం ప్రయత్నం చేస్తున్న జెన్నీ.. ఈ కొత్త అవతారంలోనూ విజయవంతమవ్వాలని ఆశిద్దాం.