Begin typing your search above and press return to search.
నెగిటివ్ రోల్ లో నాని సూపర్
By: Tupaki Desk | 14 Jun 2016 5:49 AM GMTశివలెంక కృష్ణ ప్రసాద్.. ఈ నిర్మాత పేరు గత 8 ఏళ్లుగా వినిపించడం లేదు. గతంలో ఈయన వరుసగా సినిమాలు తీసేవారు. ఆదిత్య 369, వంశానికొక్కడు లాంటి చిత్రాలు ఈయన అకౌంట్ లో ఉన్నాయి. చివరకు 2008లో మిత్రుడు తర్వాత నిర్మాణానికి దూరంగా ఉన్న ఈయన.. తనను మెప్పించే స్క్రిప్టులు రాకపోవడంతోనే నిర్మాణం వైపు చూడలేదంటున్నారు.
ఈ వారం విడుదలవుతున్న జెంటిల్మన్ చిత్రం తనకు రీఎంట్రీ లాంటిదని అంటున్న కృష్ణ ప్రసాద్.. నాని-ఇంద్రగంటి మోహన్ కృష్ణ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. 'నాని స్టార్ గా అవతరించకముందే ఈ సినిమా కోసం సైన్ చేశాడు. తను విభిన్నమైన స్క్రిప్ట్ లను ఇష్టపడతాడు. జెంటిల్మన్ అందరినీ మెప్పించే వినూత్నమైన స్టోరీ లైన్ తో ఉంటుంది' అని చెప్పిన ఈ నిర్మాత.. దర్శకుడు ఇంద్రగంటిపై కూడా చాలా నమ్మకంగా ఉన్నాడు.
బందిపోటు ఫ్లాప్ తర్వాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ చేస్తున్న చిత్రమిది. మంచి స్టోరీతో వచ్చినా హిట్ ట్రాక్ లేకపోవడంపై ఈ దర్శకుడు ఆందోళన చెందాడట. అయితే.. జెంటిల్మన్ స్టోరీపై ఉన్న నమ్మకంతో చాలా ఎలర్ట్ గా ఈ చిత్రాన్ని నిర్మించినట్లు చెబుతున్నాడు శివలెంక కృష్ణ ప్రసాద్. ముఖ్యంగా నెగిటివ్ రోల్ లో నాని చేసిన పాత్ర చాలా బాగుంటుందని అంటున్నాడీయన.