Begin typing your search above and press return to search.

పవర్ ఫుల్ కపుల్ ఖరీదైన డైవర్స్

By:  Tupaki Desk   |   10 Dec 2016 7:30 PM GMT
పవర్ ఫుల్ కపుల్ ఖరీదైన డైవర్స్
X
గాఢంగా ప్రేమించుకోవడం.. గ్రాండ్ గా పెళ్లి చేసుకోవడం... విభేదాలతో విడిపోవడం.. హాలీవుడ్- బాలీవుడ్- మాలీవుడ్ ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదో ట్రెండ్ లా నడుస్తోంది. అసలు 2016 సినీ సెలబ్రిటీస్ కి బొత్తిగా కలిసొచ్చినట్టు లేదు. ఎట్నుంచి ఎటు చూసినా ఈ విడాకుల గోల ఎక్కువైపోయింది. ఇప్పుడలా అభిమానుల గుండెలు బద్దలు కొట్టడానికి మరో సెలబ్రిటీ జంట రెడీ అయిపోయిందనే వార్తలు గుప్పుమంటున్నాయ్.

ఇప్పుడు విడిపోడానికి రెడీగా ఉంది హాలీవుడ్ ఎవర్ గ్రీన్ హ్యాండ్సమ్ హంక్ జార్జ్ క్లూనీ.. ఆయన భార్య సోషల్ యాక్టివిస్ట్ కమ్ లాయర్ వైఫైన అమల్. జార్జ్ క్లూనీ- అమల్ కి పెళ్లై గాట్టిగా రెండేళ్లు కూడా కాలేదు. మొదటి భార్యతో విడిపోయిన తర్వాత అసలు నా మనస్తత్వానికి పెళ్లి సూట్ కాదని మళ్లీ ఆ ముచ్చట జోలికి పోలేదు జార్జ్. మధ్యలో డేటింగ్ లు గట్రా చేసినా అక్కడే ఆగిపోయాడు. కానీ అమల్ ను చూసిన తర్వాత ఆగలేకపోయాడు. ఏళ్ల పరిచయాన్ని రింగ్స్ గా మార్చుకొన్నారు. 2014లో ఇటలీలో బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్ చేసుకొన్నారు. అప్పుడు వీళ్లని చూసి వరల్డ్ ది బెస్ట్ కపుల్ అంటూ అందరూ ముచ్చటపడ్డారు.

మరి అంత బెస్ట్ జంట మధ్య ఎందుకు విభేదాలు వచ్చాయంటే పిల్లల్ని కనే విషయంలోనట. నాకు పిల్లలు కావాలని అమల్.. కిడ్స్ అంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదని జార్జ్ పట్టుదలకి పోయారు. ఈ విషయంలో ఆలోచనలు కలవకపోయే సరికి ఎవరి దారి వారు చూసుకొన్నారట. అల్రెడీ విడివిడిగా నివసిస్తోన్న వీళ్లిద్దరూ త్వరలో విడాకులకి అప్లై చేయనున్నారని టాక్. ఇక భరణం కింద అమల్ కి జార్జ్ 300 మిలియన్ డాలర్లు ఇవ్వనున్నాడు. అయినా ద డీసాండెంట్స్ లో తండ్రిగా హత్తుకుపోయే పాత్రలో జీవించి అవార్డ్స్ గెల్చుకొన్న జార్జ్ కి పిల్లలంటే ఇంట్రెస్ట్ లేకపోవడమేంటో. ఒకవేళ విడిపోయే దాకా వెళితే జార్జ్- అమల్ ది మరో కాస్ట్లీ డివోర్స్ అవడం గ్యారంటీ.